228 పరుగుల లక్ష్య చేధనలో బరిలో దిగిన భారత్కు శుభారంభం దక్కలేదు. 8 పరుగులు చేసిన ధావన్... రబాడా బౌలింగ్లో ఔటయ్యాడు. అప్పటికి భారత్ 6 ఓవర్లకు 13 పరుగులే చేసింది.
-
That feeling when you claim the scalp of #ViratKohli
— Cricket World Cup (@cricketworldcup) June 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
💪 #SAvIND #CWC19 pic.twitter.com/uHj5TjktIp
">That feeling when you claim the scalp of #ViratKohli
— Cricket World Cup (@cricketworldcup) June 5, 2019
💪 #SAvIND #CWC19 pic.twitter.com/uHj5TjktIpThat feeling when you claim the scalp of #ViratKohli
— Cricket World Cup (@cricketworldcup) June 5, 2019
💪 #SAvIND #CWC19 pic.twitter.com/uHj5TjktIp
మరోవైపు రోహిత్ శర్మ దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. రోహిత్ అర్ధశతకం దిశగా దూసుకెళ్తున్నాడు.
ధావన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన టీమ్ఇండియా సారథి కోహ్లీ తడబడ్డాడు. 34 బంతుల్లో 18 పరుగులు చేసి ఫెలుక్వాయో బౌలింగ్లో ఔటయ్యాడు. 33 బంతుల వరకు ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు భారత సారథి.
ప్రోటీస్ బౌలర్లు రబాడా, ఫెలుక్వాయో చెరొక వికెట్ పడగొట్టారు.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణిత 50 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది.