భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. భారత్ మాజీ ఆటగాడు సచిన్ తెందూల్కర్ పేరిట 17 ఏళ్లుగా ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. వన్డేల్లో 222 ఇన్నింగ్స్‌లో 11 వేల పరుగులు సాధించి... వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ఘనతను దక్కించుకున్నాడు. మాంచెస్టర్ వేదికగా భారత్-పాక్ మ్యాచ్‌లో ఈ రికార్డు నమోదు చేశాడు కోహ్లీ.
సచిన్ తెందూల్కర్ 2002 జనవరి 28న కాన్పుర్‌లో ఇంగ్లాండ్‌పై తన 276 వన్డే ఇన్నింగ్స్‌లో 11 వేల మార్క్‌ను అందుకున్నాడు. 17 ఏళ్లుగా ఏ ఆటగాడు బద్దలు కొట్టలేకపోయిన ఈ రికార్డును కేవలం 222 మ్యాచుల్లోనే కోహ్లీ తిరగరాశాడు. వన్డేల్లో 11 వేల రన్స్ సాధించిన మూడో భారతీయ ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. సచిన తర్వాత ఈ జాబితాలో భారత మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ ఉన్నాడు. అతడు 288 ఇన్నింగ్స్‌లో 11 వేల పరుగులు చేశాడు.
ఈ రికార్డు ఉన్న మరికొంత మంది ఆటగాళ్లు..
రిక్కి పాటింగ్ (ఆస్టేలియా) 286 ఇన్నింగ్స్, జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా) 293 ఇన్నింగ్స్, కుమార సంగక్కర (శ్రీలంక), సనత్ జయసూర్య (శ్రీలంక), మహెలా జయవర్ధనే (శ్రీలంక), ఇంజమామ్-ఉల్ (పాకిస్థాన్).
ఇదీ చూడండి: భారత్xపాక్: మ్యాచ్‌లో తారల సందడి