ప్రపంచకప్ టైటిల్‌ను భారత క్రికెట్ జట్టు ఎగరేసుకెళ్తుందని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈసారి కోహ్లీసేన కప్‌ను సాధిస్తుందని వ్యాఖ్యానించాడు. ఆదివారం తన సొంత యూట్యూబ్ ఛానల్‌లో ఈ అంశంపై మాట్లాడాడీ మాజీ పేసర్.
" మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాపోర్డ్ వేదికగా మంగళవారం జరగనున్న మ్యాచ్‌లో కివీస్‌ను మట్టికరిపించి టీమిండియా కచ్చితంగా ఫైనల్ చేరుతుంది. న్యూజిలాండ్ క్రికెటర్లు ఒత్తిడిని తట్టుకోలేరు. బౌలింగ్, బ్యాటింగ్‌లోనూ ప్రత్యర్థి కంటే మెరుగ్గా ఉన్న కోహ్లీసేనకు తిరుగులేదు. ప్రపంచకప్ ఆసియా ఖండాన్ని దాటి బయటి దేశాలకు వెళ్లకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జులై 14న లండన్‌లోని లార్డ్స్ మైదానంలో భారత క్రికెట్ జట్టు విజేతగా అవతరిస్తుంది"
-- షోయబ్ అక్తర్, పాక్ మాజీ క్రికెటర్
రన్‌రేట్ వల్లే...
టాప్ 5లో నిలిచిన పాక్ జట్టు ప్రదర్శనను మెచ్చుకున్నాడు షోయబ్ అక్తర్. కివీస్ కన్నా పాకిస్థాన్ అద్భుతంగా ఆడిందని కితాబిచ్చాడు. రన్‌రేట్ లెక్కింపు పద్ధతి సరిగా లేకపోవడం వల్లే పాక్ ఇంటిబాట పట్టిందని.. అందుకే ఈ విధానంలో మార్పులు అవసరమని అభిప్రాయపడ్డాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">