ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లీడ్స్ వేదికగా జరిగిన ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన లంక 264 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బరిలో దిగిన భారత ఓపెనర్లు విజృంభించారు. రోహిత్(103), రాహుల్(111) శతకాలతో చెలరేగి భారత్‌కు విజయాన్ని చేకూర్చారు. లంక బౌలర్లలో మలింగ, ఇసురు ఉడానా, కసున్ రజిత తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
-
#TeamIndia go top of the #CWC19 table!
— ICC (@ICC) July 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
But for how long? ... 🤔 pic.twitter.com/FMJHmmdEX2
">#TeamIndia go top of the #CWC19 table!
— ICC (@ICC) July 6, 2019
But for how long? ... 🤔 pic.twitter.com/FMJHmmdEX2#TeamIndia go top of the #CWC19 table!
— ICC (@ICC) July 6, 2019
But for how long? ... 🤔 pic.twitter.com/FMJHmmdEX2
264 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలో దిగిన భారత్‌కు ఘనమైన ఆరంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్, కే ఎల్ రాహుల్ 189 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదే చేశారు. ఈ టోర్నీలో టీమిండియాకిదే అత్యుత్తమ భాగస్వామ్యం. ఇద్దరూ ఎడపెడా బౌండరీలు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు.
ఈ ప్రపంచకప్‌లో రోహిత్ 5వ శతకం..
-
A stunning third 💯 in a row for Rohit Sharma and his fifth of #CWC19 👏
— ICC (@ICC) July 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
A wonderful achievement for the Indian opener!#TeamIndia | #SLvIND pic.twitter.com/BXYOoVek77
">A stunning third 💯 in a row for Rohit Sharma and his fifth of #CWC19 👏
— ICC (@ICC) July 6, 2019
A wonderful achievement for the Indian opener!#TeamIndia | #SLvIND pic.twitter.com/BXYOoVek77A stunning third 💯 in a row for Rohit Sharma and his fifth of #CWC19 👏
— ICC (@ICC) July 6, 2019
A wonderful achievement for the Indian opener!#TeamIndia | #SLvIND pic.twitter.com/BXYOoVek77
92 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేసిన హిట్ మ్యాన్ కెరీర్లో 27వ సెంచరీని నమోదు చేశాడు. ఓ ప్రపంచకప్‌లో అత్యధికంగా శతకాలు(5) చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు శ్రీలంక ఆటగాడు సంగక్కర(4) పేరిట ఉంది. మొత్తం వరల్డ్‌కప్ టోర్నీల్లో ఆరు శతకాలతో ఉన్న సచిన్ రికార్డును సమం చేశాడు హిట్‌మ్యాన్.
రోహిత్ దూకుడుగా ఆడుతుంటే రాహుల్ నిలకడగా ఆడుతూ స్ట్రైక్ రొటేటే చేశాడు. ఈ జోడిని విడదీసేందుకు లంక బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. చివరికి సెంచరీ పూర్తి చేసిన రోహిత్‌ను కసున రజిత ఔట్ చేసి ఈ ద్వయాన్ని విడదీశాడు.
రాహుల్ తొలి ప్రపంచకప్ శతకం..
-
💯 for KL Rahul 🔥
— ICC (@ICC) July 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
The opener's century coming from 109 balls and his side are well on their way to victory!#SLvIND | #CWC19 | #TeamIndia pic.twitter.com/ryU7slrKmn
">💯 for KL Rahul 🔥
— ICC (@ICC) July 6, 2019
The opener's century coming from 109 balls and his side are well on their way to victory!#SLvIND | #CWC19 | #TeamIndia pic.twitter.com/ryU7slrKmn💯 for KL Rahul 🔥
— ICC (@ICC) July 6, 2019
The opener's century coming from 109 balls and his side are well on their way to victory!#SLvIND | #CWC19 | #TeamIndia pic.twitter.com/ryU7slrKmn
రోహిత్ బాటలోనే నిలకడగా ఆడిన రాహుల్ 118 బంతుల్లో 111 పరుగులు చేసి కెరీర్లో రెండో శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ వరల్డ్‌కప్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు.
అనంతరం కోహ్లీతో(34) కలిసి నిలకడగా ఆడాడు రాహుల్ సెంచరీ పూర్తి చేసి మలింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కాసేపటికే పంత్(4).. ఉడానా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగినా.. పాండ్య సాయంతో లక్ష్యాన్ని పూర్తిచేశాడు విరాట్.
-
Over to you Australia... 👀#CWC19 | #SLvIND pic.twitter.com/RSi5QgUHEI
— Cricket World Cup (@cricketworldcup) July 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Over to you Australia... 👀#CWC19 | #SLvIND pic.twitter.com/RSi5QgUHEI
— Cricket World Cup (@cricketworldcup) July 6, 2019Over to you Australia... 👀#CWC19 | #SLvIND pic.twitter.com/RSi5QgUHEI
— Cricket World Cup (@cricketworldcup) July 6, 2019
ఇది చదవండి: సచిన్ రికార్డు సమం చేసిన రోహిత్