ప్రపంచకప్ తుది సమరంలో గెలిచి ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలిచింది. మొత్తం 10 జట్లు ట్రోఫీ కోసం పోటీపడగా మోర్గాన్ సేన ట్రోఫీని ముద్దాడింది. ఈ టోర్నీలో ప్రదర్శనను బట్టి 12 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది ఐసీసీ. ఈ జట్టుకు విలియమ్సన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. 12వ ఆటగాడిగా బౌల్ట్‌కు స్థానం లభించింది.
భారత్ నుంచి ఇద్దరు ఆటగాళ్లకు స్థానం చోటు దక్కించుకున్నారు. బ్యాట్స్‌మెన్‌లో రోహిత్ శర్మ, బౌలర్లలో బుమ్రా ఉన్నారు. అత్యధికంగా ఇంగ్లాండ్ నుంచి నలుగురికి స్థానం లభించింది. న్యూజిలాండ్ నుంచి ముగ్గురు, ఆస్ట్రేలియాలో ఇద్దరు, బంగ్లాదేశ్ నుంచి ఒకరు ఎంపికయ్యారు.
-
Your #CWC19 Team of the Tournament! pic.twitter.com/6Y474dQiqZ
— ICC (@ICC) July 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Your #CWC19 Team of the Tournament! pic.twitter.com/6Y474dQiqZ
— ICC (@ICC) July 15, 2019Your #CWC19 Team of the Tournament! pic.twitter.com/6Y474dQiqZ
— ICC (@ICC) July 15, 2019
ఐసీసీ తుది 12 మంది జాబితా
రోహిత్ శర్మ (భారత్), జేసన్ రాయ్ (ఇంగ్లాండ్), విలియమ్సన్ (సారథి, న్యూజిలాండ్), షకిబుల్ హసన్ (బంగ్లాదేశ్), జో రూట్ (ఇంగ్లాండ్), బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్), అలెక్స్ కారే (కీపర్, ఆస్ట్రేలియా), మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లాండ్), ఫెర్గుసన్ (న్యూజిలాండ్), బుమ్రా (భారత్), బౌల్ట్ (12వ ఆటగాడు, న్యూజిలాండ్)
ఇవీ చూడండి.. WC19: ఇంగ్లాండ్‌కు కప్పు తెచ్చిన దత్తపుత్రులు!