2011 ప్రపంచకప్... అప్పటికి భారత్ విశ్వవిజేతగా నిలిచి 28 ఏళ్లు గడిచిపోయింది. కపిల్‌దేవ్ నేతృత్వంలో భీకర కరేబియన్ జట్టును ఓడించి తొలిసారి 1983లో భారత్ ప్రపంచకప్ గెలిచింది. ఆ తర్వాత జరిగిన మరో ఆరు ప్రపంచకప్ టోర్నీల్లో భారత్‌కు నిరాశే ఎదురైంది.
స్వదేశంలో జరిగిన 2011 ప్రపంచకప్‌పై యావత్ దేశం ఎన్నో ఆశలు పెట్టుకుంది. 2007 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపిన తిరుగులేని సారథి ఎంఎస్ ధోనిపైనే అందరి నమ్మకం. వరల్డ్‌కప్‌ను ముద్దాడాలన్నది క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ కల. అది ఈ ప్రపంచకప్‌లోనైనా నెరవేరుతుందా? క్రికెట్ దేవుడికి ఘనమైన వీడ్కోలు దక్కుతుందా? ఒత్తిడిని తట్టుకుని భారత్ మరోసారి విశ్వవిజేతగా నిలుస్తుందా? ఇన్ని ప్రశ్నల మధ్య భారత్ టోర్నీలో అడుగుపెట్టింది.
తొలి మ్యాచ్...
తొలి మ్యాచ్ భారత్- బంగ్లాదేశ్ మధ్య జరిగింది. 2007లో బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓడి మెగాటోర్ని నుంచి నిష్క్రమించింది. ఈ పరాజయం అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం తెచ్చింది. ఆ ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంది. టోర్నీని కళ్లు చెదిరే ఫోర్‌తో ప్రారంభించాడు భారత విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. బంగ్లాదేశ్ బౌలర్లను ఉతికారేస్తూ 175 (140) పరుగులు సాధించాడు వీరూ. విరాట్ కోహ్లీ 100 (83)తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.
బౌలింగ్‌లో మునాఫ్ పటేల్ 4 వికెట్లతో చెలరేగాడు. సమష్టి ప్రదర్శనతో 87 పరుగుల తేడాతో భారత్ జయకేతనం ఎగురవేసి టోర్నీని ఘనంగా ఆరంభించింది.
టోర్నీకే హైలైట్...
ఇంగ్లాండ్ X ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ మెగాటోర్నీలో తీవ్ర ఉత్కంఠ రేపింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 8/327 భారీ స్కోరు చేసింది. 328 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ జట్టు 111 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే అనూహ్యంగా ఆరో వికెట్‌కు కెవిన్ ఓబ్రెయిన్ 113 (63), అలెక్స్ కుసాక్ 47 (63) జోడీ 162 పరుగులు జత చేసింది. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది.
క్వార్టర్స్ చేరిన జట్లు..
లీగ్ దశ ముగిశాక పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పూల్-ఏ నుంచి క్వార్టర్స్ చేరాయి. పూల్- బీ నుంచి భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి.
ఆస్ట్రేలియా X భారత్...
క్వార్టర్స్‌లో భారత్ బలమైన ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కొంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ రికీ పాంటింగ్ 104 శతకంతో చెలరేగగా.. ఆసిస్ 261 పరుగుల లక్ష్యాన్ని ధోనిసేన ముందు ఉంచింది. సమష్టిగా రాణించిన భారత బ్యాట్స్‌మెన్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించారు. సచిన్ 53, గంభీర్ 50, యువరాజ్ సింగ్ 57*, రైనా 34* పరుగులు చేశారు.
-
First up in today's @bira91 @cricketworldcup Greatest Moments match-up is Yuvraj Singh's 57* that helped India beat Australia at the 2011 tournament to end their reign as world champions. pic.twitter.com/JB1N8m8uk3
— ICC (@ICC) April 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">First up in today's @bira91 @cricketworldcup Greatest Moments match-up is Yuvraj Singh's 57* that helped India beat Australia at the 2011 tournament to end their reign as world champions. pic.twitter.com/JB1N8m8uk3
— ICC (@ICC) April 13, 2019First up in today's @bira91 @cricketworldcup Greatest Moments match-up is Yuvraj Singh's 57* that helped India beat Australia at the 2011 tournament to end their reign as world champions. pic.twitter.com/JB1N8m8uk3
— ICC (@ICC) April 13, 2019
మిగిలిన క్వార్టర్స్ ఇలా...
వెస్టిండీస్‌తో తలపడి పాకిస్థాన్ సెమీస్ చేరింది. మరో క్వార్టర్స్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి శ్రీలంక సెమీస్ బెర్త్ నిలుపుకొంది. మెగాటోర్నీల్లో తన బలహీనతను కొనసాగిస్తూ దక్షిణాఫ్రికా మరోసారి కివీస్‌కు మ్యాచ్ అప్పగించింది.
సెమీస్‌లో ఢీ అంటే ఢీ...
సెమీస్‌లో న్యూజిలాండ్ X శ్రీలంక, చిరకాల ప్రత్యర్థులైన భారత్ X పాకిస్థాన్ తలపడ్డాయి.
మొదటి సెమీస్‌లో కివీస్‌ను 217 పరుగులకే ఆలౌట్ చేసింది లంక జట్టు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయం చివరకు శ్రీలంక జట్టునే వరించింది.
దాయాదుల పోరు...
మొహాలీలో జరిగిన దాయాదుల సమరానికి స్టేడియం అభిమానులతో నిండిపోయింది. మొత్తం 35 వేల మంది ఈ మ్యాచ్‌ను స్టేడియంలో వీక్షించారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 9/260 పరుగులు చేసింది. సచిన్ 85 (115) పరుగులతో రాణించాడు. తెందూల్కర్ ఈ మ్యాచ్‌లో మొత్తం 6 సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 5 క్యాచ్‌లు జార విడిచారు పాక్ ఆటగాళ్లు.
261 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన పాక్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 231 పరుగులకు ఆలౌటైంది. ఇప్పటి వరకు ప్రపంచకప్ టోర్నీలో ఒక్కసారి కూడా భారత్‌ను ఓడించలేకపోయిన పాక్... తన రికార్డును కొనసాగించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వాంఖడే వేదికగా...
శ్రీలంక X భారత్ మధ్య ముంబయి వాంఖడే వేదికగా ఫైనల్ జరిగింది. ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి రెండు ఆసియా జట్లు తుదిపోరులో తలపడ్డాయి. అభిమానుల అరుపుల మధ్య రిఫరీకి టాస్ సమయంలో ఎవరేం చెప్పారో వినపడక టాస్ రెండోసారి వేయాల్సి వచ్చింది. టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. మహేలా జయవర్థనే 104 (88) సాయంతో 6/ 274 పరుగులు చేసింది లంక జట్టు.
కిక్కిరిసిన స్టేడియంలో అభిమానుల అరుపుల మధ్య భారత ఓపెనర్లు సచిన్, సెహ్వాగ్ బ్యాటింగ్‌కు వచ్చారు. అయితే తొలి ఓవర్లోనే లసిత్ మలింగ సెహ్వాగ్‌ను ఎల్బీడబ్లూ చేసి పెవిలియన్‌కు పంపాడు. కొద్ది సేపటికే సచిన్‌ను అవుట్ చేసాడు మలింగ. స్టేడియం మొత్తం నిశబ్దం అలుముకుంది. విరాట్ కోహ్లీ 35 సాయంతో గౌతమ్ గంభీర్ 97 (122) అద్భుతంగా ఆడాడు.
కోహ్లీ వెనుదిరిగాక ఫామ్‌లో ఉన్న యువరాజ్‌ను కాదని కెప్టెన్ ధోని క్రీజులోకి వచ్చాడు. చివరి వరకు నిలిచిన ధోని మైదానంలో ఎడాపెడా షాట్లతో విరుచుకుపడ్డాడు. 91* పరుగులు చేశాడు. చివర్లో తన మార్కు హెలికాఫ్టర్ షాట్‌తో సిక్సర్ బాది 28 ఏళ్ల భారత్ నిరీక్షణకు తెరదించాడు. క్రికెట్ దేవుడు సచిన్ కల సాకారం చేశాడు.
-
#ThisDayThatYear !!
— Doordarshan National (@DDNational) April 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
02 APRIL 2011 -#India clinched the @ICC #Cricket #WorldCup 2011 , defeating #SriLanka by 6 wickets.
(Video @BCCI) pic.twitter.com/E48ZfooOyp
">#ThisDayThatYear !!
— Doordarshan National (@DDNational) April 2, 2019
02 APRIL 2011 -#India clinched the @ICC #Cricket #WorldCup 2011 , defeating #SriLanka by 6 wickets.
(Video @BCCI) pic.twitter.com/E48ZfooOyp#ThisDayThatYear !!
— Doordarshan National (@DDNational) April 2, 2019
02 APRIL 2011 -#India clinched the @ICC #Cricket #WorldCup 2011 , defeating #SriLanka by 6 wickets.
(Video @BCCI) pic.twitter.com/E48ZfooOyp
సచిన్‌ను భూజాలపై మోస్తూ భారత ఆటగాళ్లు వాంఖడేలో తిరిగిన దృశ్యాలు ఇప్పటికీ ప్రతి భారత అభిమానికి ఓ మధుర జ్ఞాపకమే.
ఆసక్తికర విషయాలు....
- యువరాజ్ సింగ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ వరల్డ్‌కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
- సెహ్వాగ్ టోర్నీని ఫోర్‌తో ఆరంభిస్తే... ధోని సిక్సర్‌తో ముగించాడు.
- ప్రపంచకప్ ఫైనల్లో సెంచరీ చేసి కూడా ఓటమి వైపు నిలిచిన జట్టులో ఉన్నవాడు జయవర్థనే ఒక్కడే.
- మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ - యువరాజ్ సింగ్
- అత్యధిక పరుగులు - తిలకరత్నే దిల్షన్ ( 500)
- అత్యధిక వికెట్లు - షాహిద్ అఫ్రిదీ (21)
- అత్యధిక స్కోరు - భారత్ 4/370 (బంగ్లాదేశ్‌తో)
- అత్యల్ప స్కోరు - బంగ్లాదేశ్ 58 (వెస్టిండీస్‌తో)
- మ్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ - ఇంగ్లాండ్ X ఐర్లాండ్
- ఇదీ చూడండి: WC 19: ఈ దిగ్గజాలు ప్రపంచకప్ అందుకోలేకపోయారు..!