ఇప్పటికే రెండు మెగాటోర్నీల్లో ఇంగ్లీష్ జట్టుకు సారథిగా ఉన్న ఇయాన్ మోర్గాన్ భవిష్యత్తు ప్రణాళికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నాడు మోర్గాన్. ప్రపంచకప్ మైకంలోనే ఉన్నానని అంటున్నాడు.
"2023 ప్రపంచకప్ వరకు సారథిగా కొనసాగాలంటే అది పెద్ద బాధ్యతే అవుతుంది. ప్రస్తుతం ఇంకా ఏ నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేను. వరల్డ్ కప్ కోసం మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి లోనయ్యా. ఇంకా ఆ మైకంలోనే ఉన్నా. రెండు మూడు నెలల్లో నిర్ణయం చెప్తా" -ఇయాన్ మోర్గాన్, ఇంగ్లాండ్ సారథి
ప్రస్తుతం జట్టుకు సంబంధించినంత వరకు 2020 టీ 20 ప్రపంచకప్పే అసలైన లక్ష్యమవుతుందని చెప్పాడు మోర్గాన్.
మోర్గాన్ సారథ్యంలో 2015 మెగాటోర్నీలో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది ఇంగ్లాండ్. 2019 లో పరిస్థితి మారింది. జట్టును అన్ని విభాగాల్లోనూ ముందుకు నడిపి ఫైనల్ వరకు చేర్చాడు మోర్గాన్. కివీస్‌తో జరిగిన తుది పోరులో నాటకీయ పరిణామాల అనంతరం వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది ఇంగ్లీష్ జట్టు.
ఇది చదవండి: విశ్వక్రీడల ముంగిట షట్లర్లకు గాయాల బెడద!