ETV Bharat / sports

హెలికాప్టర్ షాట్​ నేర్పిన మిత్రునికి ధోని ఏం చేశాడు?

ధోనికి హెలికాప్టర్ షాట్​ను నేర్పించింది అతడి స్నేహితుడు సంతోష్ లాల్. జార్ఖండ్ తరపున రంజీ మ్యాచ్​ల్లో వీరిద్దరూ కలిసి ఆడారు. 2013లో అనారోగ్యంతో బాధపడుతున్న మిత్రుడి కోసం ఎయిర్ అంబులెన్స్​ను ఏర్పాటు చేశాడు మహీ. దురదృష్టవశాత్తు సంతోష్ మరణించాడు.

ధోని
author img

By

Published : Jul 7, 2019, 5:05 PM IST

2005 ఏప్రిల్​లో భారత్ పాకిస్థాన్​తో వన్డే సిరీస్​ ఆడుతోంది. విశాఖ వేదికగా జరిగిన ఆ మ్యాచ్​లో సచిన్ ఆరంభంలో రనౌట్​ అయ్యాడు. అప్పుడు వన్​డౌన్​లో నూనుగు మీసాలతో ఓ 24 ఏళ్ల కుర్రాడు బ్యాటింగ్​కు దిగాడు. అందరూ ఇతను ఏమి ఆడతాడులే.. సెహ్వాగ్​కు అండగా నిలిస్తే చాలని అనుకున్నారు. కానీ భీకర రీతిలో అద్భుతమైన సెంచరీ చేశాడు. అతడే మహేంద్ర సింగ్ ధోనీ. 148 పరుగులతో రెచ్చిపోయాడు. మరుసటి రోజు పత్రికల్లో, టీవిల్లో ఇదే వార్త. ముఖ్యంగా వినూత్నంగా ధోనీ ఆడిన షాట్​ గురించే చర్చ. అనంతరం హెలికాప్టర్ షాట్​గా బాగా పాపులర్ అయింది. ఈ షాట్​ను మహీకి అతడి స్నేహితుడు సంతోష్ లాల్ నేర్పించాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సమోసా కోసం హెలీకాప్టర్ షాట్ నేర్పించాడు..

హెలికాప్టర్​ షాట్​ తనకు సంతోష్​ అనే స్నేహితుడు నేర్పించాడని ధోనినే చాలా సార్లు తెలిపాడు. చిన్నతనం నుంచే మిత్రులైన వీరిద్దరూ జార్ఖాండ్ తరపున రంజీ మ్యాచ్​ల్లో కలిసి ఆడారు. ఆసక్తికరమైన విషయమేమంటే సమోసాల కోసం ధోనికి హెలికాప్టర్ షాట్​ ఎలా ఆడాలో నెర్పాడంట సంతోష్​. ఈ షాట్​ను అతడు(సంతోష్​) 'తప్పడ్​ షాట్' అని పిలిచేవాడంట. అతికొద్దిమందితోనే సన్నిహితంగా ఉండే ధోని చివరి వరకు సంతోష్​​ను వదులుకోలేదు.

SANTHOSH- DHONI
సంతోష్​తో ధోని

అనారోగ్యంతో మిత్రుని మరణం..

2013లో క్లోమ గ్రంథి వాచి(పాంక్రియాటైటిస్​) సంతోష్ మరణించాడు. మిత్రుడిని రక్షించేందుకు మహీ అన్ని విధాలుగా ప్రయత్నించాడు. విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ స్నేహితుడి బాగోగులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉన్నాడు. సంతోష్ పరిస్థితి తీవ్రమైన తరుణంలో రాంచీ నుంచి దిల్లీకి ఎయిర్ అంబులెన్స్​ను ఏర్పాడు చేశాడు మహీ. అయితే వాతావరణం అనుకూలించక ఆ హెలికాప్టర్ వారణాసిలోనే దిగిపోయింది. అప్పటికే సంతోష్ పరిస్థితి విషమించింది. మిత్రుని మరణం ధోనిని ఎంతో కలచి వేసింది.

టెన్నిస్​ బాల్​తో క్రికెట్​ ఆడుతూ ఇద్దరూ రాష్ట్ర స్థాయి మ్యాచ్​లకు హాజరయ్యేవారని సంతోష్ ఇంకో స్నేహితుడు నిషాంత్ తెలిపాడు. ధోని, సంతోష్ చిన్నతనం నుంచి ప్రాణస్నేహితులని చెప్పాడు. సంతోష్ బ్యాటింగ్​ శైలి అంటే మహీకి ఎంతో ఇష్టమని, ఎప్పుడూ అభినందిస్తుంటాడని తెలిపాడు.

2016లో ధోని జీవితం ఆధారంగా బాలీవుడ్​లో వచ్చిన 'ధోని అన్​టోల్డ్ స్టోరీ' సినిమాలోనూ సంతోష్ గురించి ఉంటుంది. ఈ సినిమాలో సంతోష్.. మహీకి హెలికాప్టర్ షాట్ ఎలా నేర్పించాడో చూపించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్​.. మహీ పాత్రలో మెరువగా.. సంతోష్ పాత్రను కృష్ణ ప్రకాశ్ జా పోషించాడు. ఆ చిత్రం అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇది చదవండి: 'మహీ.. మరిన్ని విజయాలతో సాగిపో...'

AP Video Delivery Log - 1000 GMT News
Sunday, 7 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0938: Greece Election Mitsotakis AP Clients Only 4219334
Greek opposition leader comments after voting
AP-APTN-0931: Hong Kong Protest AP Clients Only 4219332
Huge march in Hong Kong against extradition bill
AP-APTN-0916: Spain Bull Run Do not obscure logo 4219316
2 runners gored in bull run at San Fermin festival
AP-APTN-0909: Greece Election Leaders AP Clients Only 4219313
Greek PM and opposition leader cast votes
AP-APTN-0906: Afghanistan Attack AP Clients Only 4219326
Several dead, many injured after car bomb in Ghazni
AP-APTN-0904: MidEast Cabinet Iran AP Clients Only 4219320
Netanyahu: Iran has violated promise to UN
AP-APTN-0839: Greece Election Tsipras AP Clients Only 4219317
Greek PM Tsipras comments after voting
AP-APTN-0819: Iran Nuclear No access by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4219315
Iran to raise uranium enrichment beyond deal limit
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.