వరుస పరాజయాలతో డీలా పడిన దక్షిణాఫ్రికా జట్టులో డివిలియర్స్ లోటు స్పష్టంగా కనపడుతోంది. గతేడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ ఆటగాడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భావించాడట. ప్రపంచకప్‌లో పునరాగమనం చేయాలని అనుకున్న డివిలియర్స్ నిర్ణయాన్ని ప్రొటీస్ క్రికెట్ బోర్డు తిరస్కరించిందని సమాచారం.
ఏప్రిల్‌లో దక్షిణాఫ్రికా ప్రపంచకప్ జట్టును ప్రకటించింది. ఇందుకు 24 గంటల ముందే జట్టులోకి రావాలనే తన నిర్ణయాన్ని బోర్డు ముందు వ్యక్తపరిచాడట డివిలియర్స్. సఫారీ జట్టు సారథి డుప్లెసిస్, కోచ్ ఓటిస్ గిబ్సన్ కూడా ఈ నిర్ణయానికి అనుకూలంగా ఉన్నారట. అయినా బోర్డు ఈ నిర్ణయాన్ని తిరస్కరించిందని తెలుస్తోంది.
"ప్రపంచకప్‌లోకి రావాలన్న నిర్ణయాన్ని డివిలియర్స్ ప్రతిపాదించాడు. కానీ సిద్ధాంతాలకు లోబడే అతని నిర్ణయాన్ని తిరస్కరించాం. 2018లో రిటైర్మెంట్ తీసుకోవద్దని అతడిని కోరా. కానీ ఆ విషయాన్ని ఏబీ పట్టించుకోలేదు. కెప్టెన్ డుప్లెసిస్, కోచ్ ఓటిస్ గిబ్సన్ కూడా డివిలియర్స్ నిర్ణయాన్ని మాతో పంచుకున్నారు. కానీ రిటైర్ అయినపుడే అతడికి అన్ని దారులు మూసుకుపోయాయి".
-లిండా జోండి, దక్షిణాఫ్రికా క్రికెట్ సెలక్షన్ కమిటీ కన్వీనర్
ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టు వరుసగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది.