గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ బ్యాట్స్‌మన్ నాథన్ కౌల్టర్‌నైల్ ఇన్నింగ్స్ ప్రస్తుత ప్రపంచకప్‌లో ఒక మంచి ఇన్నింగ్స్‌గా క్రికెట్ ప్రియులు గుర్తుంచుకుంటారు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే ఓ టెయిలెండర్ ఇలా అసాధారణ ప్రదర్శన చేయడం చాలా అరుదు. అదీ ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో.
79/5తో కంగారూ జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఆ దశలో 288 పరుగులు చేసిందంటే కారణం కౌల్టర్‌నైల్ ఇన్నింగ్సే. కెప్టెన్ స్టీవ్ స్మిత్ సహకారంతో.. గొప్ప ప్రదర్శన చేశాడీ టెయిలెండర్ బ్యాట్స్‌మన్. అతడు క్రీజులోకి వచ్చే సమయానికి జట్టు స్కోరు 147/6. అప్పటికే ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా పెవిలియన్ చేరారు. ఈ దశలో బౌండరీలతో విరుచుకుపడ్డాడీ పేసర్.
-
Australia were reduced to 79/5 against West Indies, but Nathan Coulter-Nile's fiery 92 off just 60 balls lifted them to a fighting total. 🙌
— ICC (@ICC) June 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Unsurprisingly, he is our @oppo 'Shot Maker' of the day! #AUSvWI #CWC19 pic.twitter.com/IBTXwA46B5
">Australia were reduced to 79/5 against West Indies, but Nathan Coulter-Nile's fiery 92 off just 60 balls lifted them to a fighting total. 🙌
— ICC (@ICC) June 6, 2019
Unsurprisingly, he is our @oppo 'Shot Maker' of the day! #AUSvWI #CWC19 pic.twitter.com/IBTXwA46B5Australia were reduced to 79/5 against West Indies, but Nathan Coulter-Nile's fiery 92 off just 60 balls lifted them to a fighting total. 🙌
— ICC (@ICC) June 6, 2019
Unsurprisingly, he is our @oppo 'Shot Maker' of the day! #AUSvWI #CWC19 pic.twitter.com/IBTXwA46B5
8 ఫోర్లు, 4 సిక్సర్లతో కేవలం 60 బంతుల్లోనే 92 పరుగులు చేశాడు కౌల్టర్‌నైల్. ఇది అతని వ్యక్తిగత అత్యుత్తమం మాత్రమే కాదు. ఐసీసీ ప్రపంచకప్ టోర్నీల్లో 8వ స్థానంలో వచ్చిన బ్యాట్స్‌మన్ చేసిన అత్యుత్తమ స్కోరు ఇదే కావడం విశేషం.
2015 ప్రపంచకప్ నుంచి ఆస్ట్రేలియాలోని నెం.8 బ్యాట్స్‌మన్ సగటు స్కోరు 16.3 మాత్రమే ఉందని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
వెంటాడిన గాయాలు...
ఇటీవలి కాలంలో నైల్‌ను వరుస గాయాలు వెంటాడాయి. మిచెల్ స్టార్క్, మిచెల్ జాన్సన్, జోష్ హేజిల్ వుడ్, ఫాల్క్‌నర్ వంటి పేస్ దళమున్న ఆసీస్ జట్టులో ఎన్నో సార్లు చోటు దక్కలేదు. ప్రధాన బౌలర్లకు గాయాలతో ఇప్పుడు ప్రపంచకప్ తుది జట్టులోకి వచ్చాడు. ఆసీస్‌ను ఘోర పరాభవం నుంచి తప్పించాడు. 289 పరుగుల లక్ష్యఛేదనలో 273కే పరిమితమైంది విండీస్. ఫలితంగా.. ఈ ప్రపంచకప్‌లో కంగారూ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.
ఇదీ చూడండి: