ETV Bharat / sports

WC19: బ్యాట్​, బంతి కాదు.. చేతులతోనే మాయ! - rickey ponting

వరల్డ్​కప్​ టోర్నీల్లో అత్యధిక క్యాచ్​లు రికీ పాంటింగ్ అందుకోగా.. తక్కువగా విండీస్ ఆటగాడు క్లైవ్​ లోయడ్ పట్టుకున్నాడు. ప్రపంచకప్​లో బౌలర్లు, బ్యాట్స్​మెన్​తో పాటు ఫీల్డర్లు సత్తాచాటారు. మెగాటోర్నీలవారీగా ఎక్కువ క్యాచ్​లు అందుకున్న వారిపై ఓ లుక్కేద్దాం!

ప్రపంచకప్ క్యాచ్​లు
author img

By

Published : May 17, 2019, 5:48 PM IST

ప్రపంచకప్​.. కాదు.. అసలు క్రికెట్​ అనగానే.. బౌలర్లు, బ్యాట్స్​మెన్​ల ప్రదర్శనే ఎక్కువగా గుర్తుకొస్తుంది. బ్యాట్స్​మెన్​ స్కోరు వేగం పెంచితే.. బౌలర్లు పరుగుల ప్రవాహాన్ని కట్టడి చేస్తారు. ఈ స్కోరు కట్టడిలో ముఖ్యపాత్ర పోషించేది ఫీల్డర్లే. ఔట్​ ఫీల్డ్​లో దూకుడుగా కదులుతూ గేమ్​లో కీలకంగా వ్యవహరిస్తారు. మరి మెగాటోర్నీలో సీజన్​ ప్రకారం ఎవరు ఎక్కువ క్యాచ్​లు పట్టారో చుద్దామా!

క్లైవ్​ లోయడ్​..4

WORLDCUP
క్లైవ్ లోయడ్

1975 లో జరిగిన తొలి ప్రపంచకప్​లో వెస్టిండీస్​ ఆటగాడు క్లైవ్​ అత్యధికంగా నాలుగు క్యాచ్​లు పట్టుకున్నాడు. ఇంగ్లాండ్​లో జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచింది కరేబియన్ జట్టు.

ఆసీఫ్ ఇక్బాల్​(పాకిస్థాన్), అల్విన్ కాళీచరణ్(వెస్టిండీస్)..4

WORLDCUP
ఆసిఫ్ - కాళీ చరణ్

1979లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్​లో ఇద్దరు ఆటగాళ్లు చెరో నాలుగేసి క్యాచ్​లు అందుకుని ముందంజలో ఉన్నారు. పాకిస్థాన్​కు చెందిన ఆసిఫ్ ఇక్బాల్, విండీస్ ఆటగాడు కాళీ చరణ్ ఈ ఘనత సాధించారు. ఈ టోర్నీలో విండీస్​ రెండోసారి కప్పు చేజిక్కించుకుంది.

కపిల్​దేవ్​(భారత్).. 7

WORLDCUP
కపిల్​దేవ్

1983 ప్రపంచకప్​లో భారత కెప్టెన్ కపిల్​దేవ్​ అత్యధికంగా ఏడు క్యాచ్​లు అందుకున్నాడు. విండీస్​తో జరిగిన ఫైనల్​లో రిచర్డ్స్​ క్యాచ్​ కూడా ఇందులో ఉంది. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఫైనల్​లో వెస్టిండీస్​ను ఓడించి భారత్​ మొదటి సారి ప్రపంచకప్​ సొంతం చేసుకుంది. ఈ టోర్నీలోనే కపిల్​ జింబాబ్వేపై 175 పరుగులతో మరచిపోలేని ఇన్నింగ్స్​ ఆడాడు.

కపిల్​ వన్స్​మోర్​.. 5

1983లో ఏడు క్యాచ్​లతో ఆకట్టుకున్న కపిల్​ మరోసారి విజృంభించాడు. 1987 ప్రపంచకప్​లో ఐదు క్యాచ్​లు అందుకున్నాడు. ఏడు మ్యాచు​ల్లో ఈ ఘనత సాధించాడు. భారత్, పాకిస్థాన్​ సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీలో ఆస్ట్రేలియా తొలిసారి విజేతగా నిలిచింది.

కెప్లర్ (దక్షిణాఫ్రికా)..7

WORLDCUP
కెప్లర్​

1992 ప్రపంచకప్​లో దక్షిణాఫ్రికా ఆటగాడు కెప్లర్ అత్యధికంగా ఏడు క్యాచ్​లు పట్టాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో పాకిస్థాన్.. ఇంగ్లండ్​ను ఓడించి తొలిసారి వరల్డ్​కప్​ను సొంతం చేసుకుంది. ఈ వరల్డ్​కప్​తోనే దక్షిణాఫ్రికా పునఃప్రవేశం చేసింది.

అనిల్​కుంబ్లే(భారత్)..8

WORLDCUP
అనిల్ కుంబ్లే

1996 ప్రపంచకప్​ను భారత్, పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించాయి. ఈ టోర్నీలో అనిల్ కుంబ్లే అత్యధికంగా 8 క్యాచ్​లు అందుకున్నాడు. అప్పటివరకు ఇదే రికార్డు. ఈ టోర్నీ ఫైనల్​లో ఆస్ట్రేలియాను ఓడించి శ్రీలంక తొలిసారి విశ్వవిజేతైంది.

డారిల్​ కల్లినన్(దక్షిణాఫ్రికా)..8

1999 ప్రపంచకప్​లో దక్షిణాఫ్రికా ఆటగాడు డారిల్ 9 మ్యాచుల్లో 8 క్యాచ్​లు అందుకున్నాడు. ఇంగ్లాండ్ వేదికగా​ ఆస్ట్రేలియా - దక్షిణాఫ్రికా మధ్య జరిగిన సెమీస్​ మ్యాచ్ టైగా ముగిసింది. లీగుల్లో నెట్ రన్​రేట్ ఆధారంగా ఆసీస్​ను విజేతగా ప్రకటించారు. ఈ వరల్డ్​కప్​ ఫైనల్లో పాకిస్థాన్​ను ఓడించి కప్పు రెండోసారి కైవసం చేసుకుంది ఆసీస్.

రికీ పాంటింగ్(ఆసీస్)..11

WORLDCUP
పాంటింగ్

ప్రపంచకప్​లన్నింటిలో అత్యధిక క్యాచ్​లు అందుకున్న ఆటగాడిగా పాంటింగ్ రికార్డు సృష్టించాడు. 2003 మెగాటోర్నీలో 11 మ్యాచుల్లో 11 క్యాచ్​లు అందుకున్నాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత్​ను ఓడించి ఆస్ట్రేలియా మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది.

పాల్​ కాలింగ్​వుడ్​(ఇంగ్లాండ్)..8

WORLDCUP
కాలింగ్​వుడ్​

2007 ప్రపంచకప్​లో ఇంగ్లాండ్ ఆటగాడు కాలింగ్​వుడ్​ అత్యధికంగా 8 క్యాచ్​లు అందుకున్నాడు. వెస్టిండీస్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో శ్రీలంకను ఓడించి ఆస్ట్రేలియా నాలుగోసారి వరల్డ్​కప్​ టైటిల్ నెగ్గింది. వరుసగా మూడు సార్లు ప్రపంచకప్​ను ముద్దాడిన జట్టుగా ఆసీస్​ రికార్డు సృష్టించింది.

మహేలా జయవర్ధనే(శ్రీలంక) ..8

WORLDCUP
మహేలా జయవర్ధనే

2011 ప్రపంచకప్​లో శ్రీలంక ఆటగాడు జయవర్ధనే 8 క్యాచ్​లు అందుకున్నాడు. భారత్​, శ్రీలంక, బంగ్లాదేశ్ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్​లో శ్రీలంకను ఓడించి భారత్ రెండో సారి టైటిల్​ నెగ్గింది. 28 సంవత్సరాలు విశ్వవిజేతగా నిలిచింది.

రీలే రసో(దక్షిణాఫ్రికా).. 9

WORLDCUP
రీలే రసో

2015 ప్రపంచకప్​లో దక్షిణాఫ్రికా ఆటగాడు రసో అత్యధికంగా 9 క్యాచ్​లు అందుకున్నాడు. 6 మ్యాచు​ల్లోనే ఈ ఘనత సాధించడం గమనార్హం. సెమీస్​లో న్యూజిలాండ్​పై పరాజయం చెందింది దక్షిణాఫ్రికా. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్​లో న్యూజిలాండ్​ను ఓడించి కంగారూ జట్టు ఐదో సారి ప్రపంచకప్​ సొంతం చేసుకుంది.

అత్యధిక క్యాచ్​లు రికీ పాంటింగ్​(11) అందుకోగా.. క్లైవ్​ లోయడ్(4)​ తక్కువ క్యాచ్​లు పట్టుకున్నాడు. క్లైవ్​తో పాటు ఆసిఫ్, కాళీ చరణ్​ కూడా సమానంగా ఉన్నారు. ఇప్పటివరకు 11 ప్రపంచకప్​లు జరగ్గా.. ఆస్ట్రేలియా 5 సార్లు గెలిచింది. భారత్, విండీస్ చెరో రెండు సార్లు.. శ్రీలంక, పాకిస్థాన్ చెరోసారి టైటిల్​ నెగ్గాయి.

AP Video Delivery Log - 0900 GMT News
Friday, 17 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0840: Taiwan LGBT Vote AP Clients Only 4211323
Taiwan's legislature approves same-sex marriage
AP-APTN-0830: Finland Council of Europe AP Clients Only 4211322
Council of Europe meets amid Russia threat to pull out
AP-APTN-0741: Australia Elections No Access Australia 4211317
Australian leaders campaign one day ahead of vote
AP-APTN-0741: US FL Plane on Highway Must Credit WFTV, No Access Orlando Market, No Use US Broadcast Networks 4211312
Emergency rush hour landing on Florida highway
AP-APTN-0740: Taiwan LGBT Celebrations AP Clients Only 4211314
Taiwan votes to legalize same-sex marriage
AP-APTN-0700: US NY WWII British Ship MUST CREDIT US COAST GUARD VIDEO 4211308
WWII British shipwreck leaking oil off New York
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.