న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన కోహ్లీసేన.. రెండో టెస్టులో పుంజుకోవాలని ప్రయత్నిస్తోంది. పిచ్ పరిస్థితి ఎలాగున్నా.. కివీస్ పేస్‌ను ఎదుర్కొని నిలబడాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లంతా మైదానంలో కఠోరంగా శ్రమించారు. కాగా మ్యాచ్ జరిగే హెగ్లే ఓవల్ పిచ్‌పై బీసీసీఐ సరదాగా ఓ ట్వీట్ చేసింది.
"పిచ్ ఎక్కడుందో గుర్తిస్తారా?" అని హెగ్లే ఓవల్ మైదానం చిత్రాన్ని బీసీసీఐ ట్వీట్ చేసింది. ఈ వ్యాఖ్య చూడ్డానికి సాధారణంగా కనిపిస్తున్నా పరోక్షంగా ఓ విమర్శే! ఎందుకంటే మైదానం పూర్తిగా పచ్చికతో కప్పేసి ఆకుపచ్చగా కనిపిస్తోంది. అంతర్ వృత్తంలో కత్తిరించిన పచ్చికకు, పిచ్‌పై ఉన్న పచ్చికకు అసలు తేడానే లేదు. పిచ్‌ను గుర్తించడం కష్టంగానే అనిపించింది. అందుకే బీసీసీఐ అలా ట్వీట్ చేసింది.
-
Spot the pitch 🤔🤔#NZvIND pic.twitter.com/gCbyBKsgk9
— BCCI (@BCCI) February 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Spot the pitch 🤔🤔#NZvIND pic.twitter.com/gCbyBKsgk9
— BCCI (@BCCI) February 27, 2020Spot the pitch 🤔🤔#NZvIND pic.twitter.com/gCbyBKsgk9
— BCCI (@BCCI) February 27, 2020
టర్బో టచ్ ప్రాక్టీస్..
రెండో టెస్టు ముంగిట భారత ఆటగాళ్లు విపరీతంగా సాధన చేశారు. ఫీల్డింగ్‌ను పటిష్ఠం చేసుకునేందుకు 'టర్బో టచ్' అనే డ్రిల్ నిర్వహించింది టీమిండియా. ఇందులో ఆటగాళ్లు రెండు బృందాలుగా ఏర్పడి.. బంతిని క్యాచ్‌ల రూపంలో పక్కవారికి అందించడాన్ని ప్రాక్టీస్ చేశారు.
-
Presenting #TeamIndia's new training drill - 'Turbo Touch' 🔥💪 - by @RajalArora pic.twitter.com/s5APbTNJIB
— BCCI (@BCCI) February 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Presenting #TeamIndia's new training drill - 'Turbo Touch' 🔥💪 - by @RajalArora pic.twitter.com/s5APbTNJIB
— BCCI (@BCCI) February 28, 2020Presenting #TeamIndia's new training drill - 'Turbo Touch' 🔥💪 - by @RajalArora pic.twitter.com/s5APbTNJIB
— BCCI (@BCCI) February 28, 2020
కివీస్‌కు 120 పాయింట్లు
రెండో టెస్టులో టీమిండియాను ఓడిస్తే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 120 పాయింట్లు సొంతం చేసుకోనుంది న్యూజిలాండ్. తొలి టెస్టులో పేస్, బౌన్స్ పిచ్‌కు భారత బ్యాట్స్‌మెన్ తడబడటాన్ని మరోసారి సొమ్ముచేసుకోవాలని ఆ జట్టు భావిస్తోంది! అందుకే బంతి ఎక్కువగా స్వింగ్ అయ్యేలా పిచ్‌ను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.
ట్రాక్‌పై పచ్చిక ఎక్కువుంటే బంతి రెండు వైపులా స్వింగ్ అవుతుంది. మంచి ప్రాంతాల్లో బంతులు సంధిస్తే బ్యాట్స్‌మెన్ ఆడేందుకు ఇబ్బంది పడతారు. సీనియర్ పేసర్ నీల్ వాగ్నర్ ఈ పిచ్‌పై దుమ్మురేపుతాడని బ్లాక్‌క్యాప్స్ ధీమాగా ఉంది.
-
New Zealand's record in Tests at the Hagley Oval:
— ICC (@ICC) February 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
🔸 Beat 🇱🇰 by eight wickets
🔸 Lost against 🇦🇺 by seven wickets
🔸 Beat 🇵🇰 by eight wickets
🔸 Beat 🇧🇩 by nine wickets
🔸 Draw against 🏴
🔸 Beat 🇱🇰 by 423 runs
How do you see their Test against India later this week going? pic.twitter.com/JzKTil5TRI
">New Zealand's record in Tests at the Hagley Oval:
— ICC (@ICC) February 27, 2020
🔸 Beat 🇱🇰 by eight wickets
🔸 Lost against 🇦🇺 by seven wickets
🔸 Beat 🇵🇰 by eight wickets
🔸 Beat 🇧🇩 by nine wickets
🔸 Draw against 🏴
🔸 Beat 🇱🇰 by 423 runs
How do you see their Test against India later this week going? pic.twitter.com/JzKTil5TRINew Zealand's record in Tests at the Hagley Oval:
— ICC (@ICC) February 27, 2020
🔸 Beat 🇱🇰 by eight wickets
🔸 Lost against 🇦🇺 by seven wickets
🔸 Beat 🇵🇰 by eight wickets
🔸 Beat 🇧🇩 by nine wickets
🔸 Draw against 🏴
🔸 Beat 🇱🇰 by 423 runs
How do you see their Test against India later this week going? pic.twitter.com/JzKTil5TRI
అంతేకాకుండా హెగ్లే ఓవల్ మైదానంలో న్యూజిలాండ్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు 7 టెస్టులు ఆడగా.. 4 గెలిచి ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడింది. మరో మ్యాచ్ డ్రా కాగా... ఒకటి రద్దయింది. భారత్ మాత్రం మొదటిసారి ఈ మైదానంలో ఆడనుంది.