దక్షిణాఫ్రికా X పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానం వద్ద ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బలూచిస్థాన్ ఉద్యమకారులు మైదానం సమీపంలో పోస్టర్లు అంటించారు. "పాకిస్థాన్ బలవంతపు చర్యలు కనుమరుగయ్యేలా సాయం చెయ్యండి" అనే సందేశాలతో పోస్టర్లు దర్శనమిచ్చాయి. బలూచిస్థాన్ రిపబ్లికన్ పార్టీ, వరల్డ్ బలూచ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. అయితే పాక్ అభిమానులు ఆ పోస్టర్లను ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అంతేకాకుండా పాక్ సైన్యాధిపతి కమర్ జావెద్ బజ్వా ఈ మ్యాచ్‌ను తిలకిస్తుండగా ఉద్యమకారులు గట్టి నినాదాలు చేశారు. అయితే లండన్‌లో ఇలా నిరసన తెలియజేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ బలూచిస్థాన్ పరిస్థితుల్ని తెలియజేస్తూ ఉద్యమకారులు బస్సులు, టాక్సీలపై అనేక పోస్టర్లు అంటించారు.
-
#WATCH Pakistani Cricket fans tear posters put up by Baloch activists outside the Lord's Cricket Ground, the venue of Pakistan-South Africa match, yesterday . #London pic.twitter.com/B2NLAumiy5
— ANI (@ANI) June 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH Pakistani Cricket fans tear posters put up by Baloch activists outside the Lord's Cricket Ground, the venue of Pakistan-South Africa match, yesterday . #London pic.twitter.com/B2NLAumiy5
— ANI (@ANI) June 24, 2019#WATCH Pakistani Cricket fans tear posters put up by Baloch activists outside the Lord's Cricket Ground, the venue of Pakistan-South Africa match, yesterday . #London pic.twitter.com/B2NLAumiy5
— ANI (@ANI) June 24, 2019
పాక్ ప్రభుత్వం బలూచిస్థాన్ ప్రజల హక్కుల్ని కాలరాస్తోందని గతంలోనూ పలు సార్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రపంచం దృష్టికి తమ సమస్యను తెలియజేయాలంటే ప్రపంచకప్ ఒక మార్గమనే ఉద్దేశంతో ఈ నిరసనలకు పాల్పడినట్లు తెలుస్తోంది.