ప్రపంచకప్‌లో బలమైన ప్రత్యర్థిపై విజయం సాధించి ఘనంగా టోర్నీ నుంచి వైదొలిగింది దక్షిణాఫ్రికా జట్టు. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో... 10 పరుగుల తేడాతో నెగ్గింది సఫారీ జట్టు. తొలుత బ్యాటింగ్ చేసిన డుప్లెసిస్ సేన నిర్ణీత 50 ఓవర్లలో 325 రన్స్ చేసింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్ వార్నర్ శతకంతో రాణించినా... 315 పరుగులకే ఆలౌటైంది ఆసీస్. ఫలితంగా పాయింట్ల పట్టికలో రెండో స్థానానికే పరిమితమైంది. సఫారీ బ్యాట్స్‌మెన్, శతక వీరుడు డుప్లెసిస్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
-
RESULT | PROTEAS WIN BY 10 RUNS
— Cricket South Africa (@OfficialCSA) July 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
South Africa have WON by 1️⃣ 0️⃣ runs to give @ImranTahirSA & @jpduminy21 a perfect ODI send-off#CWC19 #ProteaFire🔥 #AUSvSA pic.twitter.com/pW716KiHVc
">RESULT | PROTEAS WIN BY 10 RUNS
— Cricket South Africa (@OfficialCSA) July 6, 2019
South Africa have WON by 1️⃣ 0️⃣ runs to give @ImranTahirSA & @jpduminy21 a perfect ODI send-off#CWC19 #ProteaFire🔥 #AUSvSA pic.twitter.com/pW716KiHVcRESULT | PROTEAS WIN BY 10 RUNS
— Cricket South Africa (@OfficialCSA) July 6, 2019
South Africa have WON by 1️⃣ 0️⃣ runs to give @ImranTahirSA & @jpduminy21 a perfect ODI send-off#CWC19 #ProteaFire🔥 #AUSvSA pic.twitter.com/pW716KiHVc
-
The final #CWC19 standings table!
— Cricket World Cup (@cricketworldcup) July 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
A loss to South Africa in Manchester means Australia finish second on the points table behind India. pic.twitter.com/cIMNDM4utP
">The final #CWC19 standings table!
— Cricket World Cup (@cricketworldcup) July 6, 2019
A loss to South Africa in Manchester means Australia finish second on the points table behind India. pic.twitter.com/cIMNDM4utPThe final #CWC19 standings table!
— Cricket World Cup (@cricketworldcup) July 6, 2019
A loss to South Africa in Manchester means Australia finish second on the points table behind India. pic.twitter.com/cIMNDM4utP
వార్నర్ విజృంభణ...
ఓపెనర్‌గా బరిలోకి దిగిన వార్నర్ ప్రపంచకప్‌లో మరో శతకాన్ని నమోదు చేశాడు. 39 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన ఈ విధ్వంసకర ఆటగాడు... 122 పరుగులు ( 117 బంతుల్లో; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించాడు. ఫలితంగా ఈ ప్రపంచకప్‌లో మూడో శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో 17వ సెంచరీ చేసి... ఆసీస్ మాజీ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ (16) పేరిట ఉన్న శతకాల రికార్డును అధిగమించాడు.
-
💯 for Warner!
— Cricket World Cup (@cricketworldcup) July 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
His third of #CWC19, 17th of his career in ODIs, and he brings it up with a four! What a tournament he's having! #AUSvSA pic.twitter.com/C6iuhKVqG9
">💯 for Warner!
— Cricket World Cup (@cricketworldcup) July 6, 2019
His third of #CWC19, 17th of his career in ODIs, and he brings it up with a four! What a tournament he's having! #AUSvSA pic.twitter.com/C6iuhKVqG9💯 for Warner!
— Cricket World Cup (@cricketworldcup) July 6, 2019
His third of #CWC19, 17th of his career in ODIs, and he brings it up with a four! What a tournament he's having! #AUSvSA pic.twitter.com/C6iuhKVqG9
మరో ఎండ్‌లో సహచరులు వరుసగా పెవిలియన్ చేరుతున్నా.. వార్నర్ తనదైన ఆటతీరుతో జట్టును విజయపుటంచుల వరకు తీసుకెళ్లాడు. ఫించ్(3), ఖవాజా(18), స్మిత్(7), స్టోయినిస్(22), మాక్స్వెల్(12) పరుగులతో నిరాశపరిచారు. కీపర్ అలెక్స్ కేరీ (85 పరుగులు) చేసి వార్నర్‌కు మంచి సహకారం అందించాడు. వీరిద్దరూ 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 7 ఓవర్ల వ్యవధిలో వీరిద్దరి వికెట్లతో సహా కమిన్స్ ఔటవడం వల్ల జట్టు కష్టాల్లో పడింది. చివర్లో స్టార్క్ కొంచెం శ్రమించినా ఆసీస్‌కు భంగపాటు తప్పలేదు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ 3 వికెట్లు, ప్రిటోరియస్, ఫెలుక్వాయో చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. తాహిర్, మోరిస్ ఒక్కో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
కెప్టెన్ ఇన్నింగ్స్...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీ జట్టుకు మంచి ఆరంభాన్నిచ్చారు ఓపెనర్లు. మార్క్రమ్ (34), డికాక్ (52) పరుగులతో రాణించారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మార్క్రమ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సారథి డుప్లెసిస్ కెరీర్లో మరో శతకం సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో తొలిసారి 100 పరుగులు (94 బంతుల్లో; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చేశాడు. మరో బ్యాట్స్‌మెన్ డస్సెన్ 95 పరుగులతో రాణించడంతో.. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది సఫారీ జట్టు. వీరిద్దరి ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది ప్రొటీస్ జట్టు.
-
FAF-TASTIC HUNDRED! | SA 260/2, 42.2 overs#FafDuPlessis gets to his 1️⃣2️⃣th ODI century, as the Proteas set up for a massive total#CWC19 #ProteaFire🔥 #AUSvSA pic.twitter.com/XSMlUrWUaB
— Cricket South Africa (@OfficialCSA) July 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">FAF-TASTIC HUNDRED! | SA 260/2, 42.2 overs#FafDuPlessis gets to his 1️⃣2️⃣th ODI century, as the Proteas set up for a massive total#CWC19 #ProteaFire🔥 #AUSvSA pic.twitter.com/XSMlUrWUaB
— Cricket South Africa (@OfficialCSA) July 6, 2019FAF-TASTIC HUNDRED! | SA 260/2, 42.2 overs#FafDuPlessis gets to his 1️⃣2️⃣th ODI century, as the Proteas set up for a massive total#CWC19 #ProteaFire🔥 #AUSvSA pic.twitter.com/XSMlUrWUaB
— Cricket South Africa (@OfficialCSA) July 6, 2019
ఆసీస్ బౌలర్లలో స్టార్క్, లయన్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. కమిన్స్, బెరెండార్ఫ్ తలో వికెట్ తీసుకున్నారు.
ఆసీస్‌కు రెండో స్థానం..
ఈ మ్యాచ్‌లో నెగ్గిన దక్షిణాఫ్రికా జట్టు... 7 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. వరుస విజయాలతో దూసుకెళ్లిన ఆస్ట్రేలియా జట్టు చివరి లీగ్ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఫలితంగా టాప్ స్థానాన్ని దక్కించుకోలేకపోయింది. 9 మ్యాచ్‌లు ఆడిన ఆసీస్ 7 విజయాలు, 2 అపజయాలు ఖాతాలో వేసుకుంది. ఫలితంగా 14 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికే పరిమితమైంది. బర్మింగ్ హామ్ వేదికగా జులై 11న జరగనున్న రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌తో తలపడనుంది కంగారూ జట్టు.