ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 86 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. లార్డ్స్ వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ కివీస్‌కు 244 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 157 పరుగులకే చేతులెత్తేశారు. విలియమ్సన్(40), రాస్ టేలర్(30) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ మరోసారి ఐదు వికెట్లతో రెచ్చిపోగా.. బెహ్రెంన్డార్ఫ్ 2 వికట్లతో ఆకట్టుకున్నాడు. కమిన్స్, లయన్, స్మిత్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
కీలక సమయంలో అర్ధశతకంతో ఆకట్టుకున్న ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీకి(71) మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ఓపెనర్లు విఫలం..
లక్ష్య ఛేదనలో కివీస్ ఆరంభం నుంచి నిదానంగా ఆడింది. పదో ఓవర్లో ఓపెనర్ హెన్రీ నీకోల్స్(8)ను బెహ్రెండార్ఫ్ ఔట్ చేశాడు. అప్పటికీ జట్టు స్కోరు 29 పరుగులే. కాసేపటికే మరో ఓపెనర్ గప్తిల్(20)ను పెవిలియన్‌కు పంపాడు బెహ్రెండార్ఫ్.
కాసేపు పోరాడిన విలియమ్సన్ - టేలర్
అనంతరం క్రీజులోకి వచ్చిన విలియమ్సన్ - టేలర్ జోడీ నిలకడగా ఆడింది. వీరిద్దరూ 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. విలియమ్సన్‌ను ఔట్ చేసి స్టార్క్ ఈ ద్వయాన్ని విడదీశాడు. కాసేపటికీ టేలర్(30).. కమిన్స్ చేతిలో ఔటయ్యాడు. తర్వతా కివీస్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సేపు పట్టలేదు.
సత్తా చాటిన స్టార్క్..
ఓపెనర్లను బెహ్రెండార్ఫ్ ఔట్ చేస్తే.. మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ పంపి కివీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు మిషెల్ స్టార్క్. కీలకమైన విలియమ్సన్, టామ్ లాథమ్‌ను ఔట్ చేశాడు. 10 ఓవర్లు వేసిన స్టార్క్ 44 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. స్టార్క్ ఈ టోర్నీలో ఈ ఘనత సాధించడం ఇది రెండో సారి. అంతకముందు వెస్టిండీస్‌తో మ్యాచ్‌లోనూ 5 వికట్లతో ఆకట్టుకున్నాడు స్టార్క్.
ప్రపంచకప్‌లో మరో హ్యాట్రిక్...
అంతకముందు బ్యాటింగ్ చేసిన ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ల్లో ఖవాజా(88), అలెక్స్ కేరీ(71, 72 బంతుల్లో) అర్ధశతకాలతో రాణించారు. 50వ ఓవర్లో హ్యాట్రిక్ తీశాడు బౌల్ట్. చివరి ఓవర్ మూడో బంతికి ఖవాజాను ఔట్ చేసిన బౌల్ట్... నాలుగో బంతికి స్టార్క్‌ను వెనక్కి పంపాడు. ఐదో బంతితో బెహ్రెండార్ప్ వికెట్‌ను పడగొట్టాడు. మొత్తం మీద బౌల్ట్ 4 వికెట్లు తీశాడు. ఫెర్గ్యూసన్, జేమ్స్ నీషమ్ చెరో రెండు వికెట్లు తీశారు.
-
Here's how the table looks after the penultimate double-header of #CWC19 👀 pic.twitter.com/G4ZzxLJ9NF
— Cricket World Cup (@cricketworldcup) June 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Here's how the table looks after the penultimate double-header of #CWC19 👀 pic.twitter.com/G4ZzxLJ9NF
— Cricket World Cup (@cricketworldcup) June 29, 2019Here's how the table looks after the penultimate double-header of #CWC19 👀 pic.twitter.com/G4ZzxLJ9NF
— Cricket World Cup (@cricketworldcup) June 29, 2019
ఇది చదవండి: మ్యాచ్‌లో తేనెటీగలు.. ఇదే మొదటిసారి కాదు