ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. మాంచెస్టర్ వేదికగా జరిగే ఈ పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది సఫారీ జట్టు. ప్రొటీస్ కెప్టెన్ డూప్లెసిస్(100)శతకంతో ఆకట్టుకోగా.. డసెన్(95), డికాక్(54) అర్ధశతకాలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, లయన్ చెరో రెండు వికెట్లు తీయగా.. బెహెండార్ఫ్, కమిన్స్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు శుభారంభం దక్కింది. ఓపెనర్లు మార్క్‌క్రమ్(34) - డికాక్ జోడి 79 పరుగులు చేసింది. నిలకడగా ఆడుతున్న మార్క్క్రమ్ను ఔట్ చేసి ఈ ద్వయాన్ని విడదీశాడు ఆసీస్ బౌలర్ లయన్. అనంతరం క్రీజులోకి వచ్చిన డూప్లెసిస్ నిలకడగా ఆడాడు. అర్ధశతకం చేసిన డికాక్‌ను పెవిలియన్ చేర్చారు లయన్.
ప్రపంచకప్‌లో ప్రొటీస్ కెప్టెన్ తొలి శతకం..
-
You can see how much this century meant to #FafDuPlessis! #CWC19 | #AUSvSA | #ProteaFire pic.twitter.com/csAAu7UF5X
— Cricket World Cup (@cricketworldcup) July 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">You can see how much this century meant to #FafDuPlessis! #CWC19 | #AUSvSA | #ProteaFire pic.twitter.com/csAAu7UF5X
— Cricket World Cup (@cricketworldcup) July 6, 2019You can see how much this century meant to #FafDuPlessis! #CWC19 | #AUSvSA | #ProteaFire pic.twitter.com/csAAu7UF5X
— Cricket World Cup (@cricketworldcup) July 6, 2019
డికాక్ ఔటైన తర్వాత డసెన్ సాయంతో రెచ్చిపోయాడు డూప్లెసిస్. ఈ ప్రపంచకప్‌లో పెద్దగా ఆకట్టుకోని ప్రొటీస్ కెప్టెన్ ఈ మ్యాచ్‌లో విజృంభించాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు వేగాన్ని పెంచాడు. ఓపెనర్లు బలమైన పునాది వేయగా.. ఆ ఆరంభాన్ని భారీ స్కోరు దిశగా తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించాడు. 93 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. తర్వాతి బంతికే బెహెండార్ఫ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.
చివర్లో పరుగులు కట్టడి చేసిన ఆసీస్
-
He goes for the hundred but Rassie van der Dussen is caught off the last ball!
— Cricket World Cup (@cricketworldcup) July 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
His 95 and the skipper's century lift South Africa to 325/6. Good enough for a win? #CWC19 | #AUSvSA pic.twitter.com/z7SGPiqtuK
">He goes for the hundred but Rassie van der Dussen is caught off the last ball!
— Cricket World Cup (@cricketworldcup) July 6, 2019
His 95 and the skipper's century lift South Africa to 325/6. Good enough for a win? #CWC19 | #AUSvSA pic.twitter.com/z7SGPiqtuKHe goes for the hundred but Rassie van der Dussen is caught off the last ball!
— Cricket World Cup (@cricketworldcup) July 6, 2019
His 95 and the skipper's century lift South Africa to 325/6. Good enough for a win? #CWC19 | #AUSvSA pic.twitter.com/z7SGPiqtuK
డూప్లెసిస్ ఔటైన అనంతరం డసెన్ విజృంభించాడు. 95 పరుగులు చేసి కొద్దిలో శతకం చేజార్చుకున్నాడు. మొదట నుంచి వేగంగా ఆడిన సఫారీ జట్టు చివర్లో వేగంగా పరుగులు చేయలేకపోయింది. ఆసీస్ బౌలర్లు ఆఖరున పరుగులు కట్టడి చేసినందువల్ల ఆశించిన స్కోరు చేయలేకపోయింది ప్రొటీస్ జట్టు. 49వ ఓవర్లో స్టార్క్ 4 పరుగులే ఇచ్చి ఓ వికెట్ తీశాడు. చివరి ఓవర్లో 8 పరుగులే వచ్చాయి.