డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 187 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన అఫ్గాన్‌ను 32.4 ఓవర్లకు 152 పరుగులకు పరిమితం చేసింది శ్రీలంక. నువాన్ ప్రదీప్ (4/31), లసిత్ మలింగ (3/39) అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశారు. నజీబుల్లా (43; 56 బంతుల్లో 6×4) చివరి వరకు పోరాడాడు. హజ్రతుల్లా (30), గుల్బదిన్ నయీబ్ (23) ఫర్వాలేదనిపించారు. అంతకు ముందు కుశాల్ పెరీరా (78; 81 బంతుల్లో 8×4), కరుణరత్నె (30; 45 బంతుల్లో 3×4) అదరగొట్టడంతో 36.5 ఓవర్లకు లంక 201 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 41 ఓవర్లకు కుదించారు. 4 వికెట్లతో సత్తా చాటిన నువాన్ ప్రదీప్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.
-
Nuwan Pradeep was on 🔥 today!
— Cricket World Cup (@cricketworldcup) June 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
☝️ Hazratullah Zazai
☝️ Hashmatullah Shahidi
☝️ Gulbadin Naib
☝️ Rashid Khan
Relive his career-best ODI spell of 4/31 👇https://t.co/5NbGVKSAex
">Nuwan Pradeep was on 🔥 today!
— Cricket World Cup (@cricketworldcup) June 4, 2019
☝️ Hazratullah Zazai
☝️ Hashmatullah Shahidi
☝️ Gulbadin Naib
☝️ Rashid Khan
Relive his career-best ODI spell of 4/31 👇https://t.co/5NbGVKSAexNuwan Pradeep was on 🔥 today!
— Cricket World Cup (@cricketworldcup) June 4, 2019
☝️ Hazratullah Zazai
☝️ Hashmatullah Shahidi
☝️ Gulbadin Naib
☝️ Rashid Khan
Relive his career-best ODI spell of 4/31 👇https://t.co/5NbGVKSAex
57 పరుగులకే 5 వికెట్లు...
187 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగిన అఫ్గాన్ జట్టు ఆరంభంలో ఓవరుకు కనీసం ఒక బౌండరీ బాదింది. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ షెహజాద్ ఔట్ అవ్వడం వల్ల ఒత్తిడికి గురైంది. పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకున్న లంకేయులు బౌన్సర్లతో విరుచుకుపడ్డారు. దీంతో వెంట వెంటనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది అఫ్గాన్. రన్ రేట్ క్రమంగా తగ్గిపోయింది. హజ్రతుల్లా జజాయ్ 30 పరుగులు చేశాడు.
ఓ దశలో 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన అఫ్గాన్‌ను సారథి గుల్పదిన్ నయీబ్ సహాయంతో నజీబుల్లా జద్రాన్ గాడిన పెట్టాడానికి ప్రయత్నించాడు. లంక స్వింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న ఈ జోడీ స్కోర్ బోర్డును ముందుకు నడిపించింది. కానీ నయీబ్‌ను ఔటవడం వల్ల వికెట్ల పతనం మళ్లీ మొదలైంది. 32వ ఓవరు చివరి బంతికి జద్రాన్ రనౌట్ అవ్వడం వల్ల అఫ్గాన్ ఆశలకు తెరపడింది.
-
WHAT A BALL!
— Cricket World Cup (@cricketworldcup) June 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Lasith Malinga finished it off in style with a 🔥 yorker to dismiss Hamid Hassan.https://t.co/S3h3LX1ly6
">WHAT A BALL!
— Cricket World Cup (@cricketworldcup) June 4, 2019
Lasith Malinga finished it off in style with a 🔥 yorker to dismiss Hamid Hassan.https://t.co/S3h3LX1ly6WHAT A BALL!
— Cricket World Cup (@cricketworldcup) June 4, 2019
Lasith Malinga finished it off in style with a 🔥 yorker to dismiss Hamid Hassan.https://t.co/S3h3LX1ly6
అంతకు ముందు టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన లంక 36.5 ఓవర్లకు 201 పరుగులు చేసింది. అఫ్గాన్ ఆల్‌రౌండర్ నబీ ధాటికి లంక మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. ఓపెనర్ కుశాల్ పెరీరా మినహా ఎవరూ ఆకట్టుకోలేకపోయారు.
అఫ్గాన్ బౌలర్లలో నబీ 4 వికెట్లతో విజృంభించగా, రషీద్, దవ్లాత్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. హసన్ ఒక వికెట్ తీశాడు.