భారత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మధ్యాహ్నం మాంచెస్టర్‌లో జరగనున్న ప్రపంచకప్ మ్యాచ్‌పై సర్వత్రా భారీ అంచనాలున్నాయి. బెట్టింగ్‌లూ అదే స్థాయిలో జరగనున్నాయి. దిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలో నేడు రూ.100 కోట్ల బెట్టింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు పోలీసులు. బెట్టింగ్ రాయుళ్లు, అంతర్జాతీయ సిండికేట్లతో పరిచయాలున్న బుకీలు దిల్లీకి దగ్గరలో ఉన్న ఫరీదాబాద్, ఘాజియాబాద్, నోయిడా, గురుగ్రామ్‌లలో అధికంగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
నిఘా కట్టుదిట్టం
దాయాదుల పోరు నేపథ్యంలో భారీగా జరిగే బెట్టింగ్ నియంత్రణకు దిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు.
"బెట్టింగుల నిర్వహణపై నిఘా ఉంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఐదు నక్షత్రాల హోటళ్లు, అథితి గృహాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ముఖ్యంగా బెట్టింగులు ఎక్కువగా జరిగే కరోల్ బాగ్, పాత దిల్లీపై ప్రత్యేక దృష్టి పెట్టాం. భారీ నెట్‌వర్క్‌తో జరుగుతున్న బెట్టింగ్‌లను తెలుసుకోవడం కష్టంగా ఉన్నా.. మా ప్రయత్నాలు చేస్తున్నాం."
--- మధుర్ వర్మ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్
బెట్టింగ్ పెట్టేదెవరంటే...
ఇప్పటివరకు పాక్‌పై భారత్ ఆధిపత్యం కారణంగా మ్యాచ్‌లో గెలుపుపై మాత్రమే కాకుండా ప్రతి బాల్, ఓవర్పైనాడా బెట్టింగ్‌లు జరిగే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
"ఎక్కువ వికెట్లు ఎవరు తీస్తారు. ఎవరు ఎక్కువ సిక్సులు కొడతారు వంటి అంశాలపై చాలా మంది పందెం వేస్తుంటారు. టాస్ వేసిన తర్వాత కెప్టెన్ నిర్ణయాన్ని బట్టి బెట్టింగులు ప్రారంభమవుతాయి. ఈసారి బెట్టింగ్ రేట్ భారత్‌పై రూ.1.55గా, పాకిస్థాన్‌పై రూ.45గా ఉంది.
ఏటా ఐపీఎల్ సీజన్, ఇప్పుడు ప్రపంచకప్‌లో ఎక్కువగా కళాశాల విద్యార్థులు, వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులు, క్రికెట్ ప్రేమికులు, ట్రేడర్లు, కార్పొరేట్ మహిళలు, హవాలా నిర్వాహకులు మా దగ్గర బెట్టింగ్ వేస్తారు. మొత్తం 60 శాతం మంది భారత్‌కు అనుకూలంగానే పందెం వేస్తారు."
- ఓ బెట్టింగ్ నిర్వాహకుడు
ఎన్ని రన్లు, లేదా ఎన్ని వికెట్ల తేడాతో జట్లు విజయం సాధిస్తాయి.., మొదట బ్యాటింగ్ చేసే జట్టు 400లకు పైగా స్కోరు సాధిస్తుందా లేదా అనే అంశాలపైనా బెట్టింగులు సాగుతాయని నిర్వాకులు చెబుతున్నారు.
ఇరు జట్లలో ఎవరు మూడు వికెట్ల కన్నా ఎక్కువగా వికెట్లు తీస్తారనేదానిపైనా బెట్టింగ్ వేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా భారత్‌లో బుమ్రా, చాహల్, పాకిస్థాన్ జట్టులో మహ్మద్ అమీర్, వహబ్ రియాజ్‌లపై బెట్టింగ్ జరగనున్నట్లు చెప్పారు. బుమ్రాకు రేటింగ్ రూ.15గా ఉండగా, అమీర్‌కు రూ.6 ఉన్నట్లు తెలుస్తోంది.
బ్యాటింగ్‌పై అయితే ఎవరు అర్థ శతకం, శతకం చేస్తారు.... అనే అంశాలపై బెట్టింగులు సాగుతున్నాయని వివరించారు. వీరిలో ముఖ్యంగా భారత్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ... పాకిస్థాన్ జట్టులో బబ్బర్ అజామ్, ఫక్హర్ జమాన్లపై బెట్టింగ్‌లు జరగనున్నాయని నిర్వాహకులు అంటున్నారు.
ఇదీ చూడండి: భారత్ X పాక్ మ్యాచ్ జరిగే అవకాశముందా?