న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో భారత్ పరాజయం చెంది మెగాటోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే 2015 ప్రపంచకప్ సెమీస్, ఈ రోజు జరిగిన సెమీస్ మ్యాచ్‌లో కొన్ని పోలికలు ఉన్నాయి.
- ఈ రెండు టోర్నీల్లో భారత్ సెమీస్‌లోనే వెనుదిరిగింది.
- 2015లో విరాట్ కోహ్లీ ఒక్క పరుగుకే ఔట్ కాగా.. ఈ రోజు మ్యాచ్‌లోనూ ఒకే పరుగు చేసి పెవిలియన్ చేరాడు.
- 2015 సెమీస్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని(65) అర్ధశతకం చేసి రనౌట్ అయ్యాడు. ఈరోజు కూడా అర్ధసెంచరీ చేసి రనౌట్‌గా పెవిలియన్ చేరాడు.
- ఈ రెండు సెమీస్ మ్యాచ్‌ల్లోనూ భారత్ టాస్ ఓడి బౌలింగ్ చేసింది. లక్ష్య ఛేదనలో పరాజయం చెందింది.
మాంచెస్టర్ వేదికగా కివీస్‌తో జరిగిన వరల్డ్‌కప్ సెమీస్ మ్యాచ్‌లో భారత్ 18 పరుగల తేడాతో ఓడింది. ప్రపంచకప్ టోర్నీల్లో ఇప్పటి వరకు ఎనిమిది సార్లు సెమీస్ చేరిన కివీస్.. ఆరు సార్లు ఓడగా.. రెండు సార్లు ఫైనల్ (2015, 2019) చేరింది.
ఇది చదవండి: "45 రోజుల కష్టం 45 నిమిషాల్లో చేజారింది"