ETV Bharat / sports

గేల్​ను అంకుల్ అని ఆటపట్టించిన చాహల్ - Chahal About Chris Gayle

వెస్టిండీస్​ బ్యాట్స్​మెన్​ క్రిస్​ గేల్​ను 'అంకుల్​' అని సంబోధించాడు టీమ్ఇండియా స్పిన్నర్​ యుజ్వేంద్ర చాహల్​. "అంకుల్​.. నిన్న రాత్రి ప్రభావం అనుకుంటా?" అంటూ వ్యాఖ్యానించాడు. చాహల్​ అలా ఎందుకు అన్నాడో మీరూ చూసేయండి.

Yuzvendra Chahal Trolls "Uncle" Chris Gayle
'గేల్​ అంకుల్​.. నిన్న రాత్రి తాగింది దిగలేదా?'
author img

By

Published : Jun 13, 2020, 6:47 AM IST

న్యూజిలాండ్​ బ్యాట్స్​మన్​ మార్టిన్​ గప్తిల్​ వికెట్​ తీసిన వీడియోను ఇన్​స్టాగ్రామ్​లో తాజాగా షేర్​ చేశాడు టీమ్​ఇండియా లెగ్​ స్పిన్నర్​ యుజ్వేంద్ర చాహల్​. ఈ వీడియోపై వెస్టిండీస్​ బ్యాట్స్​మెన్ క్రిస్​గేల్​.. "బౌలింగ్​ చేసేప్పుడు నువ్వు లైన్​ను దాటావు. నో బాల్​​" అని కామెంట్​ పెట్టాడు. దీనికి చాహల్​.."హా.. హా.. అంకుల్​.. నిన్న రాత్రి ప్రభావం అనుకుంటా!" అని ప్రతిస్పందించాడు. వీరిద్దరి సంభాషణ చూసి నెటిజన్లు నవ్వుతూ కామెంట్లు పెడుతున్నారు.

Yuzvendra Chahal Trolls
చాహల్​ ఇన్​స్టాగ్రామ్​ పోస్ట్​

ఈ వీడియోకు మరో స్పిన్నర్​ కుల్దీప్​ యాదవ్​ బాగా బౌల్డ్​ చేశావని చాహల్​ను ప్రశంసించాడు. చాహల్​ దీనికి రిప్లే ఇస్తూ.. "మీ లాగే బౌలింగ్​ చేయడానికి ప్రయత్నిస్తున్నా సోదరా..!" అని అన్నాడు.

భారత్​-అఫ్ఘానిస్థాన్​ ఎలెవన్​

లాక్​డౌన్​ కారణంగా ఇంటికే పరిమితమైన యుజ్వేంద్ర చాహల్​.. కుటుంబసభ్యులతో పాటు సోషల్ ​మీడియాలోనూ సమయాన్ని గడుపుతున్నాడు. ఇటీవల అఫ్ఘానిస్థాన్ స్పిన్నర్​ రషీద్​ ఖాన్​తో లైవ్​ సెనష్​లో పాల్గొన్నాడు. వీరిద్దరూ కలిసి భారత్​-అఫ్ఘానిస్థాన్ ఆటగాళ్లతో ఉత్తమ ఎలెవన్​ జట్టును తయారుచేశారు. అందులో కేవలం ముగ్గురు అఫ్ఘాన్​ క్రికెటర్లు ఉండగా మిగిలిన వారంతా భారత ఆటగాళ్లే. ​​

ఇదీ చూడండి... కొత్త జెర్సీతో బరిలో దిగుతా: ఈటీవీ భారత్​తో శ్రీశాంత్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.