టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, ఆశిష్ నెహ్రాలతో కలిసున్న చిత్రాన్ని ఆదివారం సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. చరవాణులు లేని కాలం నాటి ఆ చిత్రం అందర్ని నవ్వించే విధంగా ఉంది.
"ఓ పేలవ ప్రదర్శన తర్వాత తల్లిదండ్రులు మీ ఫోన్ బిల్లును చెల్లించకపోతే" అనే క్యాప్షన్‌తో నెహ్రా, సెహ్వాగ్, లక్ష్మణ్‌లను ట్యాగ్ చేశాడు. మొబైల్స్ లేని రోజుల్లో ఫోన్ మాట్లాడుకోవడానికి మాజీ క్రికెటర్లు ఈ విధంగా బూత్‌లో నిల్చొని కష్టపడేవారని యువీ తెలిపాడు.
-
When your parents don’t pay your mobile phone bill after a bad performance 😆! #throwback to days without 📱😇 @virendersehwag @VVSLaxman281 pic.twitter.com/qF8LIUCSt6
— yuvraj singh (@YUVSTRONG12) May 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">When your parents don’t pay your mobile phone bill after a bad performance 😆! #throwback to days without 📱😇 @virendersehwag @VVSLaxman281 pic.twitter.com/qF8LIUCSt6
— yuvraj singh (@YUVSTRONG12) May 24, 2020When your parents don’t pay your mobile phone bill after a bad performance 😆! #throwback to days without 📱😇 @virendersehwag @VVSLaxman281 pic.twitter.com/qF8LIUCSt6
— yuvraj singh (@YUVSTRONG12) May 24, 2020
కీపిట్ అప్ ఛాలెంజ్
యువరాజ్.. ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో భారత మాజీ క్రికెటర్లకు ఓ సరికొత్త సవాలు విసిరాడు. #KeepItUp అనే ఛాలెంజ్‌ను ప్రారంభించి దీన్ని కొనసాగించండి అంటూ పలువురిని నామినేట్ చేశాడు. అందులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్, రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్‌తో పాటు యునైటెడ్ నేషన్స్, నటి దియా మీర్జా ఉన్నారు. అయితే ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన సచిన్.. కళ్లకు గంతలు కట్టుకొని అదే పని చేయమని యువీకి తిరిగి నామినేట్ చేశాడు.
ఇదీ చూడండి... భారత హాకీ లెజెండ్ బల్బీర్ సింగ్ ఇకలేరు