ETV Bharat / sports

యువీ దృష్టిలో గొప్ప ఎడమ చేతివాటం క్రికెటర్లు వీరే?

ఆగస్టు 13.. ప్రపంచవ్యాప్తంగా ఎడమ చేతివాటం వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటైన దినోత్సవం. కుడిచేతి వాటం వారితో సమానమని చెప్తూ.. వారిలో ఆత్మవిశ్వాసం నింపాలన్నదే ఈ రోజు ఉద్దేశం. అయితే క్రికెట్​లో లెఫ్ట్​ హ్యాండర్​ అయిన యువీ.. ఈ రోజును గుర్తుచేసుకొని ఓ ట్వీట్​ చేశాడు. తన దృష్టిలో గొప్ప ఎడమ చేతివాటం క్రికెటర్లు ఎవరో స్పష్టం చేశాడు.

yuvraj singh latest news
యువీ దృష్టిలో గొప్ప ఎడమ చేతివాటం క్రికెటర్లు ఎవరంటే?
author img

By

Published : Aug 13, 2020, 7:33 PM IST

ఎడమచేతి వాటం అంటేనే ఏదో ప్రత్యేకత. ఇతరులతో పోలిస్తే వారు భిన్నంగా, తెలివిగా ఉంటారని భావిస్తుంటారు. ఆగస్టు 13న అంతర్జాతీయ ఎడమ చేతివాటం వారి దినోత్సవం. ఈ సందర్భంగా టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ ‌సింగ్‌ ఓ ట్వీట్‌ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత గొప్ప ఎడమచేతి వాటం ఆటగాళ్లెవరో చెప్పాడు. నలుగురి చిత్రాలను పోస్ట్‌ చేశాడు. ఇంకా ఎవరినైనా మర్చిపోతే గుర్తు చేయాలని అభిమానులకు సూచించాడు.

యువీ ట్వీట్‌ చేసిన వారిలో ఆస్ట్రేలియా విధ్వంసకర క్రికెటర్లు మాథ్యూ హెడెన్‌‌, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ ఉన్నారు. వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారాకు చోటిచ్చాడు. తననెంతో ప్రోత్సహించిన టీమ్‌ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీని ప్రత్యేకంగా గౌరవించాడు.

"అంతర్జాతీయ క్రికెట్లోని అత్యంత గొప్ప ఎడమ చేతివాటం ఆటగాళ్లకు నివాళి. ఈ జాబితాను మరింత పెంచండి. మీకు ఇష్టమైన ఎడమ చేతివాటం క్రికెటర్‌ ఎవరో చెప్పండి" అని యువీ వ్యాఖ్య పెట్టాడు.

అభిమానుల నుంచి దీనికి విశేష స్పందన లభించింది. "పాజీ ఇందులో మీరు యువరాజ్‌సింగ్‌ పేరు రాయలేదు. భారత్‌లో అతిగొప్ప ఎడమచేతి వాటం ఆల్‌రౌండర్‌ అతడే" అని మాజీ క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా కామెంట్‌ చేశాడు.

మరికొందరు 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌ పోటీల్లో అదరగొట్టిన గౌతమ్‌ గంభీర్‌ను మర్చిపోయావని గుర్తు చేశారు. ఇంకొందరు కుమార సంగక్కర, అలిస్టర్‌ కుక్‌, సర్‌ గ్యారీ సోబర్స్‌, క్లైవ్‌ లాయిడ్‌, సనత్‌ జయసూర్య తదితరుల పేర్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.