ప్రపంచకప్ ఆసక్తికరంగా సాగుతోంది. మంగళవారం బర్మింగ్‌హామ్‌లో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై నెగ్గిన భారత్ జట్టు సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇది జరుగుతుండగానే ట్విట్టర్లో ఇద్దరు మాజీ క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇంగ్లాండ్‌కు చెందిన కెవిన్ పీటర్సన్‌కు టీమిండియా ఆటగాడు యువరాజ్ సింగ్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు.
అసలేం జరిగింది..
ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. ఈ ప్రపంచకప్‌లో అతడికిది నాలుగోది. దీనిపై స్పందించిన యువరాజ్... "ఐసీసీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ట్రోఫీకి చేరువవుతున్నావంటూ" రోహిత్ శర్మను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.
"ఇంగ్లాండ్ కప్పు గెలవకపోతే పై-చుకర్" అంటూ రిప్లై ఇచ్చాడు కెవిన్ పీటర్సన్.
"ముందు సెమీస్‌కు అర్హత సాధించండి, ఆ తర్వాత కప్పు గెలవడం గురించి మాట్లాడు. నేను మాట్లాడేది కప్పు కోసం కాదు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గురించి" అంటూ పీటర్సన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు యువరాజ్.
మంగళవారం చివరి వరకు ఎంతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 28 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. శతకంతో ఆకట్టుకున్న రోహిత్ శర్మ.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. జులై 6న శ్రీలంకతో తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది భారత జట్టు.
ఇది చదవండి: WC19: టీమిండియాకు బంగ్లా నేర్పిన పాఠం