ETV Bharat / sports

ఆస్ట్రేలియా ఛారిటీ మ్యాచ్​లో యువరాజ్​ సింగ్​ - Yuvraj Singh confirmed his participation in the Bushfire Cricket Bash to be held on February 8

భారత మాజీ క్రికెటర్​, సిక్సర్ల కింగ్​ యువరాజ్ సింగ్​ త్వరలో మైదానంలో కనువిందు చేయనున్నాడు. ఆస్ట్రేలియాలో జరగనున్న ఓ ఛారిటీ క్రికెట్​లో బరిలోకి దిగనున్నాడు. ఈ మ్యాచ్​ ఫిబ్రవరి 8న నిర్వహించనున్నారు.

Yuvraj Singh confirmed his participation in the Bushfire relief game to be held on February 8
ఆస్ట్రేలియా ఛారిటీ మ్యాచ్​లో యువరాజ్​ సింగ్​
author img

By

Published : Jan 26, 2020, 7:26 PM IST

Updated : Feb 25, 2020, 5:16 PM IST

ఆస్ట్రేలియాలోని కార్చిచ్చు బాధితుల కోసం విరాళాలు సేకరించేందుకు ఫిబ్రవరి 8న ఓ ఛారిటీ మ్యాచ్‌ను నిర్వహించనుంది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. ఇందులో పాల్గొనే ఇరు జట్లకు షేన్ వార్న్, రికీ పాంటింగ్‌ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. తాజాగా ఈ మ్యాచ్​లో ఆడేందుకు భారత మాజీ క్రికెటర్​, ప్రపంచకప్​ల వీరుడు యువరాజ్​ సింగ్​ అంగీకరించాడు.

'బుష్​ఫైర్​ క్రికెట్​ బాష్'​ పేరుతో జరగనున్న ఈ మ్యాచ్​లో రికీ పాంటింగ్ జట్టుకు సచిన్ తెందూల్కర్.. షేన్ వార్న్ జట్టుకు కోట్నీ వాల్ష్(వెస్టిండీస్​) కోచ్‌లుగా వ్యవహరించనున్నారు.

  • How great is it to have @sachin_rt taking part in the Bushfire Cricket Bash and giving up his time to come out for the cause. Picked the right team to coach too! pic.twitter.com/RVSdy28vO7

    — Ricky Ponting AO (@RickyPonting) January 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఎందరో ప్రముఖులు...

ఈ మ్యాచ్​లో పాకిస్థాన్​ మాజీ ఆల్​రౌండర్​ వసీం అక్రమ్​, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు జస్టిన్​ లాంగర్​, మాథ్యూ హెడెన్​, ఆండ్రూ సైమండ్స్​, బ్రాడ్​ హడిన్​, మైక్​ హస్సీ, ఆడమ్​ గిల్​క్రిస్ట్​, మైఖెల్​ క్లార్క్​, షేన్​ వాట్సన్​, అలెక్స్​ బ్లాక్​ వెల్​ బరిలోకి దిగనున్నారు. వీరితో పాటు నాన్​ ప్లేయింగ్​ కెప్టెన్లుగా ఆసీస్​ మహిళా క్రికెటర్​ మేల్​ జేన్స్​, స్టీవ్​ వా కూడా కనువిందు చేయనున్నారు.

ఈ మ్యాచ్ ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని ఆస్ట్రేలియన్ రెడ్ క్రాస్ డిజాస్టర్ రిలీఫ్ అండ్ రికవరీ ఫండ్‌కు అందజేయనున్నారు. ఇదే రోజున బిగ్​బాష్​ లీగ్​ ఫైనల్​, భారత్​-ఆస్ట్రేలియా మధ్య మహిళల టీ20 మ్యాచ్​ జరగనుంది.

కార్చిచ్చు బాధితుల కోసం ప్రస్తుత ఆసీస్​ క్రికెటర్లు క్రిస్​ లిన్​, గ్లెన్​ మ్యాక్స్​వెల్​, డార్సీ షార్ట్​ కూడా తమ వంతు విరాళాలు ఇస్తామని ప్రకటించారు. బిగ్​బాష్​ లీగ్​లో ఆడుతున్న వీళ్లు.. లీగ్​లో ఎన్ని సిక్సర్లు కొడితే ఒక్కోదానికి 17వేల రూపాయలతో గుణించి ఆ మొత్తాన్ని అందజేస్తామని ప్రకటించారు.

Intro:Body:

https://www.aninews.in/news/national/general-news/we-are-providing-assistance-to-agencies-probing-sharjeel-imam-says-jehanabad-sp20200126185415/

Conclusion:
Last Updated : Feb 25, 2020, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.