ETV Bharat / sports

ఉత్తరాఖండ్​ వరద బాధితులకు పంత్​ విరాళం

author img

By

Published : Feb 8, 2021, 10:00 AM IST

ఉత్తరాఖండ్​ వరద సహాయక చర్యల కోసం తన మ్యాచ్​ ఫీజును సాయంగా ఇస్తానని తెలిపాడు యువ క్రికెటర్​ రిషభ్​పంత్​. ఘటనపై విచారం వ్యక్తం చేశాడు.

Young cricketer Rishabh Pant announces donation for flood victims in Uttarakhand's Chamoli district
ఉత్తరాఖండ్​ వరద బాధితులకు పంత్​ విరాళం

టీమ్​ఇండియా వికెట్​కీపర్​ రిషభ్​పంత్​ పెద్ద మనసు చాటుకున్నాడు. ఉత్తరాఖండ్​ చమోలీలో సంభవించిన జలవిలయంలో సహాయక చర్యల కోసం తన వంతు సాయం ప్రకటించాడు. తన మ్యాచ్​ ఫీజును విరాళంగా ఇస్తానని.. అవసరమైతే మరికొంత మందిని సాయం చేయాల్సిందిగా కోరుతానని పేర్కొన్నాడు.

ఉత్తరాఖండ్​లో జరిగిన జలవిలయ ఘటనపై పంత్​ విచారం వ్యక్తం చేశాడు. "సహాయక చర్యల కోసం నా మ్యాచ్​ ఫీజును విరాళంగా ఇవ్వాలనుకున్నాను. మరింత ఎక్కువ మందిని రక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంకొంత మందిని సాయం చేయాలని కోరుతాను" అని పంత్​ తెలిపాడు.

ధౌలీగంగా, అలకానంద నదులకు వరద పోటేత్తడం వల్ల జలవిలయం జరిగింది. దీంతో తపోవన్​-రేని ప్రాంతంలో భీభత్సంగా వరదలు వచ్చాయి. రిషిగంగా ప్రాజెక్టు సమీపంలో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. అక్కడ ఉన్న సుమారు 170 మంది కార్మికులు గల్లంతయ్యారు. పది మంది మృతదేహాలను వెలికితీశారు.

కాగా, స్వదేశంలో ఇంగ్లాండ్​తో జరుగుతోన్న టెస్టులో రిషభ్​పంత్​ అద్భుతమైన బ్యాటింగ్​ చేశాడు. 88 బంతుల్లోనే 91 పరుగులు చేసి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు.

ఇదీ చదవండి: 'అలా ఔట్​ అవ్వడం దురదృష్టకరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.