ETV Bharat / sports

'వికెట్ ​కీపర్ రొటేషనా? మరే దేశంలో జరగదు' - వికెట్​కీపింగ్​పై సాహా స్పందన

వికెట్​కీపింగ్ స్థానానికి పంత్​ కన్నా తానే అర్హుడని పరోక్షంగా అన్నాడు టీమ్​ఇండియా క్రికెటర్ సాహా. తనను తాను ఎప్పుడూ వికెట్‌కీపర్‌గానే పరిగణించుకుంటానని తెలిపిన అతడు.. పంత్​ మెరుగైన బ్యాట్స్​మన్​ అని చెప్పాడు. వికెట్‌కీపింగ్‌ అనేది స్పెషలిస్ట్‌ స్థానం అని చెప్పుకొచ్చిన అతడు.. ఎవరు వికెట్‌ కీపింగ్‌ చేయాలో నిర్ణయించాల్సింది మాత్రం మేనేజ్‌మెంటే అని వెల్లడించాడు.

panth
పంత్​
author img

By

Published : Jan 26, 2021, 6:57 AM IST

టెస్టుల్లో వికెట్‌కీపింగ్‌ స్థానం కోసం యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌, సీనియర్‌ వృద్ధిమాన్‌ సాహాల మధ్య చాలాకాలం నుంచి గట్టి పోటీ నడుస్తోంది. పంత్‌ మెరుగైన బ్యాట్స్‌మన్‌ అయితే.. సాహా ఏమో మెరుగైన వికెట్‌కీపర్‌. అయితే జట్టు మేనేజ్‌మెంట్‌.. ఆస్ట్రేలియాతో చివరి మూడు టెస్టుల్లో పంత్‌నే ఎంచుకుంది. పంత్‌ కూడా వీరోచిత బ్యాటింగ్‌తో వికెట్‌ కీపర్‌ రేసులో ముందుకు దూసుకెళ్లాడు. కానీ పంత్‌ బ్యాటింగ్‌ పట్ల తానేమీ ఆందోళన చెందట్లేదని సాహా వ్యాఖ్యానించాడు.

"నేను 2018 నుంచే ఈ పోలికల గురించి వింటున్నా. నా పని నేను చేస్తా. పంత్‌ ఎలా బ్యాటింగ్‌ చేస్తున్నాడన్న దాని గురించి ఆందోళన చెందను. ఆ కారణం వల్ల నేను నా ఆటను మార్చుకోను. ఎవరు వికెట్‌ కీపింగ్‌ చేయాలో నిర్ణయించాల్సింది మేనేజ్‌మెంటే. ఒక్క క్యాచ్‌ చేజారినా మ్యాచ్‌ ఫలితం మారేందుకు ఆస్కారముంది. వికెట్‌కీపింగ్‌ అనేది స్పెషలిస్ట్‌ స్థానం. నేను వచ్చిన ప్రతి క్యాచ్‌నూ పడతానని చెప్పట్లేదు. కానీ స్పెషలిస్ట్‌ స్థానం స్పెషలిస్ట్‌ స్థానం లాగే ఉండాలి" అని సాహా చెప్పాడు.

మొదట వికెట్‌కీపర్‌నే..

పంత్‌ మెరుగైన బ్యాట్స్‌మన్‌, సాహా మెరుగైన కీపర్‌ అన్న అభిప్రాయంపై స్పందిస్తూ.. "అది నిజం. దాన్ని కొట్టిపారేయలేం. నన్ను నేను మొదట వికెట్‌కీపర్‌గానే పరిగణించుకుంటా. దీనిపై పంత్‌ అభిప్రాయమేంటో నాకు తెలియదు. అదనపు బ్యాట్స్‌మన్‌ కావాలా లేదా స్పెషలిస్ట్‌ కీపర్‌ కావాలా అన్నది మేనేజ్‌మెంట్‌ ఇష్టం" అని అన్నాడు.

ఒకే ఫార్మాట్లో వికెట్‌ కీపర్లను రొటేట్‌ చేయడం మరే దేశంలోనూ జరగదని సాహా చెప్పాడు. "ఫార్మాట్లను బట్టి జట్లు వికెట్‌కీపర్లను మారుస్తాయి. మన దేశంలోలా ఒకే ఫార్మాట్లో (ఇక్కడ టెస్టుల్లో) రెండు మూడు మ్యాచ్‌ల తర్వాత కీపర్లను రొటేట్‌ చేయడమనేది చాలా అరుదు. కానీ మేం ప్రొఫెషనల్‌ క్రికెటర్లం. మేనేజ్‌మెంట్‌పై విశ్వాసం ఉంచాలి. కేవలం ఒక్క మ్యాచ్‌ తర్వాత కూడా వాళ్లు కీపర్‌ను మార్చాలనుకుంటే మేం అంగీకరించాల్సిందే" అన్నాడు. పంత్‌, తాను ఈ విషయాలు గురించి మాట్లాడుకోమని, జట్టులో ఎవరున్నా బాగా ఆడాలని కోరుకుంటామని చెప్పాడు.

ఇదీ చూడండి : ఆ సమయంలో గుండె పగిలినట్లనిపించింది: పంత్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.