ప్రపంచకప్‌లో అదరగొట్టిన జోఫ్రా ఆర్చర్.. త్వరలో జరిగే యాషెస్ సిరీస్ కోసం ఎంపికయ్యాడు. తొలి టెస్టు కోసం ఇంగ్లాండ్ శనివారం ప్రకటించిన 14 మందితో కూడిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మళ్లీ వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.
24 ఏళ్ల ఆర్చర్.. ఇంగ్లాండ్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసింది ఈ ఏడాదే. ఆ వెంటనే ప్రపంచకప్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. ఇప్పుడు ప్రఖ్యాత యాషెస్ సిరీస్‌లో ప్రముఖ పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆగస్టు 1 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఈ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.
జో రూట్ సారథ్యం వహిస్తున్న ఈ జట్టుకు బట్లర్, స్టోక్స్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ఇటీవలే ఐర్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో 143 పరుగుల తేడాతో విజయం సాధించింది ఇంగ్లీష్ జట్టు.
యాషెస్ తొలి టెస్టుకు ఇంగ్లాండ్ జట్టు
జో రూట్(కెప్టెన్), బెన్ స్టోక్స్, జాస్ బట్లర్, మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జేమ్స్ అండర్సన్, జానీ బెయిర్ స్టో, స్టువర్ట్ బ్రాడ్, రోరి బర్న్స్, శామ్ కరన్, జో డెన్లీ, జేసన్ రాయ్, క్రిస్ వోక్స్, ఓలీ స్టోన్
ఇది చదవండి: యాషెస్ సిరీస్‌లో తలపడే ఆసీస్ జట్టు ఇదే..