ETV Bharat / sports

WC 19: బంగ్లా బెంగ తీరుతుందా... - బంగ్లాదేశ్

ప్రపంచకప్​ టోర్నీలో ఈసారి ఎలాగైనా సత్తాచాటాలని భావిస్తోంది బంగ్లాదేశ్ జట్టు. మెగాటోర్నీలో ప్రదర్శనను మెరుగుపర్చుకోవాలని చూస్తోంది. జట్టులో ఎక్కువ మంది అనుభవజ్ఞులు ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.

WC19: బంగ్లా బెంగ తీరుతుందా...
author img

By

Published : May 29, 2019, 6:00 AM IST

బంగ్లాదేశ్ ఒకప్పుడు పసికూన.. ఇటీవల బలమైన జట్లకు షాక్​ ఇస్తూ మంచి టీమ్​గా ఎదిగింది. 2015 ప్రపంచకప్​ తర్వాత నాలుగేళ్లలో చాలా మారిందీ జట్టు. ఛాంపియన్స్​ ట్రోఫీలో సెమీఫైనల్ వరకు చేరింది. అనంతరం జరిగిన ఆసియా కప్​లో ఫైనల్​కు వెళ్లి చివరి బంతి వరకు పోరాడి ఓటమిపాలైంది. ఈ వరల్డ్​కప్​లో బంగ్లాను చిన్నజట్టే అని అంచనా వేస్తే మాత్రం ప్రత్యర్థికి పరాభవం తప్పదు.

1999లో బంగ్లాదేశ్ తొలి ప్రపంచకప్​ ఆడింది. 2015లో ఇంగ్లాండ్‌పై విజయంతో క్వార్టర్‌ ఫైనల్‌ చేరడం మినహా ప్రతీసారి గ్రూప్‌ దశకే పరిమితమైంది. 2007లో భారత్‌పై సాధించిన సంచలన విజయంతో సూపర్‌-8​కు అర్హత సాధించింది. ఈసారి మెరుగైన ర్యాంకింగ్‌తో వెస్టిండీస్‌ను వెనక్కి తోసి నేరుగా టోర్నీకి అర్హత సాధించింది. మొత్తంగా 33 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు ఆడిన బంగ్లాదేశ్​ 11 గెలిచి.. 20 ఓడింది​. రెండు మ్యాచ్​లు రద్దయ్యాయి.

World Cup 2019: Spasmodic Bangladesh; the dark horse
ఐర్లాండ్​లో జరిగిన త్రైపాక్షిక సిరీస్ ట్రోపీతో మొర్తజా

బలాలు

అనుభవజ్ఞులైన, అత్యుత్తమ ఆటగాళ్లతో ఈసారి బరిలోకి దిగుతోంది బంగ్లాదేశ్​ జట్టు. గతంలో జరిగిన ఏ ప్రపంచకప్​ టోర్నీలోనూ ఆ జట్టు ఇంత సమతూకంతో లేదు. దాదాపు ఇదే ఆటగాళ్లతో కూడిన జట్టు ఇంగ్లాండ్‌లో 2017లో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో సెమీస్‌కు చేరింది. వారిపైనే నమ్మకముంచి.. అదే జట్టును కొనసాగించి ఇటీవల మంచి ఫలితాలను సాధించింది బంగ్లాదేశ్​. సారథి మొర్తజా, తమీమ్ ఇక్బాల్, షకీబుల్ హసన్, ముష్ఫికర్ రహీం, మహ్ముదుల్లా లాంటి అనుభవజ్ఞులు ఆ జట్టు సొంతం. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆల్​రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన షకీబ్‌ జట్టుకు కీలకం కానున్నాడు. ఈ ప్రపంచ కప్​ తర్వాత ఆటకు వీడ్కోలు చెప్పనున్న మొర్తజా టోర్నీని చిరస్మరణీయం చేసుకోవాలని భావిస్తున్నాడు. యువ బౌలర్​ ముస్తాఫిజుర్​ రెహ్మాన్​ బంగ్లా జట్టుకు అతి పెద్ద బలం. ఇంగ్లాండ్ పిచ్​లపై అతని స్వింగ్, పేస్​ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలడు.

బంగ్లా బౌలింగ్ కౌచ్​తో ముస్తాఫిజుర్

బలహీనతలు

ఇప్పటి వరకు ఆడిన ప్రపంచకప్​ టోర్నీల్లో కొన్ని మెరుపులు తప్పితే వరుస విజయాలు సాధించలేదు బంగ్లా జట్టు. ఈ కారణంగా బంగ్లాను పెద్ద జట్టుగా ఎవరూ భావించరు. మెగాటోర్నీలో ఎన్నో ఆశలతో బరిలోకి దిగడం.. ఆ తర్వాత కీలక మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమించలేక ఓటమిని చవిచూడటం ఆ జట్టుకున్న పెద్ద లోపం. అత్యుత్తమ ఆటగాళ్లు, అనుభవం ఉన్నా సరే... అవసరమైన సమయాల్లో గతంలో చాలాసార్లు సరైన ప్రదర్శన కనబరచలేదు. కీలక సమయాల్లో ప్రధాన ఆటగాళ్లు తరచూ విఫలమవుతుంటారు. తమీమ్, ముష్ఫికర్‌లు వరుస మ్యాచ్​ల్లో రాణించడం అరుదు. రుబెల్‌ బౌలింగ్‌ చాలాసార్లు గాడి తప్పుతుంటుంది. కెరీర్‌ చివర్లో మొర్తజా బౌలింగ్‌లో పదును కనిపించడం లేదు. సరిగ్గా చెప్పాలంటే షకీబ్, ముస్తాఫిజుర్‌ మినహా మరే బౌలర్‌ను నమ్మలేని పరిస్థితి బంగ్లా జట్టుది.

తమీమ్ ఇక్బాల్

జట్టు వివరాలు
మష్రఫె మొర్తజా (కెప్టెన్‌), ముష్ఫికర్‌ రహీమ్, సౌమ్య సర్కార్, షబ్బీర్‌ రహమాన్, మహ్ముదుల్లా, అబూ జావెద్, లిటన్‌ దాస్, మెహదీ హసన్, మహమ్మద్‌ మిథున్, సైఫుద్దీన్, మొసద్దీక్‌ హుసేన్​, ముస్తాఫిజుర్‌ రహమాన్, రుబెల్‌ హుస్సేన్, షకీబుల్ హసన్, తమీమ్‌ ఇక్బాల్‌.

ఇవీ చూడండి.. WC 19: 2015 రికార్డులు.. మెరుపులు.. భావోద్వేగాలు

RESTRICTION SUMMARY: MUST CREDIT RUDAW TV; DO NOT OBSCURE LOGO; NO ACCESS IRAQ; NO RE-SALE; NO ARCHIVE; NO AP REUSE
SHOTLIST:
RUDAW - MUST CREDIT RUDAW TV; DO NOT OBSCURE LOGO; NO ACCESS IRAQ; NO RE-SALE; NO ARCHIVE; NO AP REUSE
Irbil - 28 May 2019
++STARTS ON SOUNDBITE++
++GRAPHICS AT SOURCE++
1. SOUNDBITE (Kurdish) Vala Farid, Speaker of Iraqi Kurdish parliament:
"Nechirvan Idris Mustafa Barzani; dear members, those who agree that his Excellency Nechirvan Idris Mustafa Barzani to become the president of Kurdistan region, please raise your hand."
2. Various of the parliamentary session showing the majority of MPs raising their hands in support of Barzani
3. SOUNDBITE (Kurdish) Vala Farid, Speaker of Iraqi Kurdish parliament:
"Mr. Nechirvan Idris Mustafa Barzani from a total of eighty one MP's present has achieved 68 votes."
5. Members of KDP fraction in the parliament cheering the victory
6. Members of parliament leaving at the end of the session
STORYLINE:
Iraq's self-governing Kurdish region has elected a new president in a parliamentary vote boycotted by a key opposition party.
Former prime minister Nechirvan Barzani will follow his uncle Masoud Barzani in office.
The elder Barzani resigned in November 2017 after a failed bid for independence from Iraq.
The Barzani family and their Kurdistan Democratic Party have dominated Iraqi Kurdish politics for generations.
The opposition Patriotic Union of Kurdistan stayed away from Tuesday's vote after coalition talks between the two parties broke down.
The Kurdish region has enjoyed a large degree of autonomy within Iraq since the fall of Saddam Hussein in 2003.
Its forces, known as the peshmerga, have played a key role in the defeat of the Islamic State group in the country.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.