ETV Bharat / sports

మ్యాచ్​ ఓడినా.. కెప్టెన్​ ఘనత సాధించాడు

శనివారం జరిగిన ప్రపంచకప్​ మ్యాచ్​లో న్యూజిలాండ్​ చేతిలో ఓడిపోయింది శ్రీలంక. ఈ మ్యాచ్​లో ఇన్నింగ్స్​ చివరి వరకు నిలిచిన లంక కెప్టెన్ కరుణరత్నే సరికొత్త రికార్డు తన పేరిట నమోదు చేశాడు.

మ్యాచ్​ ఓడినా.. ఘనత సాధించాడీ కెప్టెన్​
author img

By

Published : Jun 1, 2019, 9:08 PM IST

కార్డిఫ్​లో జరిగిన ప్రపంచకప్​ మ్యాచ్​లో శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలిచింది. ముందుగా బ్యాటింగ్​ చేసిన లంక జట్టులో కెప్టెన్ దిముత్ కరుణరత్నే మినహా అందరూ విఫలమయ్యారు. మ్యాచ్​ ఓడినా తన పేరిట సరికొత్త రికార్డు నెలకొల్పాడీ బ్యాట్స్​మెన్. ఓ వరల్డ్​కప్ మ్యాచ్​లో ఓపెనర్​గా వచ్చి చివరి వరకు నిలిచిన రెండో ఆటగాడిగా నిలిచాడు.

dimuth karunaratne
శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే

ఇంతకు ముందు ఈ రికార్డు వెస్టిండీస్​ బ్యాట్స్​మెన్ రిడ్లీ జాకబ్స్ పేరిట ఉంది. 1999 ప్రపంచకప్​లో ఆస్ట్రేలియాతో మ్యాచ్​లో ఓపెనర్​గా వచ్చిన జాకబ్స్.. ఇన్నింగ్స్​ చివరి వరకు నిలిచి 49 పరుగులు చేశాడు. మళ్లీ ఇప్పుడు శ్రీలంక బ్యాట్స్​మెన్ కరుణరత్నే చివరి వరకు క్రీజులో ఉండి 52 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఇది చదవండి: లంకపై పది వికెట్ల తేడాతో కివీస్​ ఘనవిజయం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.