అంచనాల్లేకుండా ప్రపంచకప్ బరిలో నిలిచిన బంగ్లాదేశ్ తొలి మ్యాచ్‌లోనే రికార్డులు నెలకొల్పింది. ఆదివారం ఓవల్‌లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో 50 ఓవర్లలో 330 పరుగులు చేసిన బంగ్లా బ్యాట్స్‌మెన్.. వన్డేల్లో అత్యధిక స్కోరు నమోదు చేశారు.
మూడో వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది బంగ్లాదేశ్. వరల్డ్‌కప్‌లో ఆ జట్టు తరఫున మూడో వికెట్‌కు ఇదే అత్యుత్తమం. అంతకు ముందు 2015 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో మహ్మదుల్లా-ముష్ఫీకర్‌లు 141 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
![hakib Al Hasan-Mushfiqur Rahim](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3453216_shakib-al-hasan.jpg)
ఈ మ్యాచ్‌లో 75 పరుగులు చేశాడు షకిబుల్ హసన్. ప్రపంచకప్‌లో మూడో స్థానంలో దిగి దక్షిణాఫ్రికాపై అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బంగ్లా బ్యాట్స్‌మెన్‌గా షకిబుల్ రికార్డు నెలకొల్పాడు.
ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్‌లో 50 ఓవర్ల పాటు ఆడిన రెండో జట్టు బంగ్లాదేశ్. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మాత్రమే నిర్ణీత ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది. మిగతా జట్లన్ని 40 ఓవర్లలోపే మ్యాచ్‌ను ముగించాయి.
ఇది చదవండి: సత్తా చాటిన బంగ్లా- దక్షిణాఫ్రికా లక్ష్యం 331