అంతర్జాతీయ క్రికెట్ మండలి విధించిన కరోనా నియమాలపై పాకిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిదీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో భాగంగా ముల్తాన్ సుల్తాన్ జట్టు తరఫున ఆడుతున్నాడు ఆఫ్రిదీ. బౌలింగ్ చేసేటప్పుడు క్యాప్‌ను ఫీల్డ్ అంపైర్‌కు ఇవ్వగా.. దాన్ని తీసుకోవడానికి అంపైర్ నిరాకరించాడు. దీంతో ఆశ్చర్యపోవడం ఆఫ్రిదీ వంతైంది.
ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందించాడు షాహిద్. "డియర్ ఐసీసీ.. ఆటగాళ్లు, అంపైర్లు ఒకే బయో బబుల్‌లో ఉన్నప్పుడు.. బౌలర్ల టోపీని పట్టుకోవడానికి అభ్యంతరమేంటి? అలాగే ఆట చివరలో షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి అనుమతించరెందుకు? ఇది ఆశ్చర్యంగా ఉంది" అంటూ ట్వీట్ చేశాడు.
-
Dear @ICC wondering why the umpires are not allowed to hold bowlers cap even though they are in the same bubble as the players/management and even shake hands at the end of the game? 🤷♂️
— Shahid Afridi (@SAfridiOfficial) February 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Dear @ICC wondering why the umpires are not allowed to hold bowlers cap even though they are in the same bubble as the players/management and even shake hands at the end of the game? 🤷♂️
— Shahid Afridi (@SAfridiOfficial) February 24, 2021Dear @ICC wondering why the umpires are not allowed to hold bowlers cap even though they are in the same bubble as the players/management and even shake hands at the end of the game? 🤷♂️
— Shahid Afridi (@SAfridiOfficial) February 24, 2021
కొవిడ్ నేపథ్యంలో ఐసీసీ కొత్త నిబంధనలు పెట్టింది. బంతిపై మెరుపు కోసం ఉమ్ము రుద్దడాన్ని నిషేధించింది. ప్రత్యామ్నాయంగా చెమటను రుద్దవచ్చని స్పష్టం చేసింది. కొత్త నిబంధనలకు ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు.
ఇదీ చదవండి: రూట్‌కు 5 వికెట్లు.. 145 పరుగులకు భారత్ ఆలౌట్