ETV Bharat / sports

టీ20 ర్యాంకింగ్స్​లో అగ్రస్థానాన్ని కోల్పోయిన షెఫాలీ - : Shafali Verma loses top spot

ఐసీసీ తాజా మహిళా టీ20 ర్యాంకింగ్స్​లో టీమిండియా స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ అగ్రస్థానాన్ని కోల్పోయింది. రెండు స్థానాలు దిగజారి మూడో ర్యాంకుకు పడిపోయింది.

షెఫాలీ
షెఫాలీ
author img

By

Published : Mar 9, 2020, 2:32 PM IST

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్​లో టీమిండియా స్టార్ బ్యాట్స్​ఉమెన్ షెఫాలీ వర్మ (744) రెండు స్థానాలు పడిపోయింది. టీ20 ప్రపంచకప్​లో ఆసాంతం రాణించి, నిన్న జరిగిన​ ఫైనల్లో రెండు పరుగులకే పరిమితమై నిరాశపర్చింది. ఫలితంగా అగ్రస్థానం కోల్పోయి, మూడో స్థానానికి పరిమితమైంది. ఇదే టోర్నీలో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ (762) మొదటి ర్యాంకుకు చేరుకుంది. ఆసీస్​కే చెందిన సుజీ బేట్స్ (750) రెండో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన వారిలో భారత్ నుంచి స్మృతి మంధాన 7, జెమీమా రోడ్రిగ్స్ 9వ స్థానాల్లో ఉన్నారు.

బౌలర్ల విభాగంలో ఇంగ్లాండ్ బౌలర్ సోఫీ ఎక్లెస్టోన్ 779 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ నుంచి దీప్తి శర్మ.. ఓ స్థానం కోల్పోయి ఆరో స్థానానికి చేరింది. రాధా యాదవ్, పూనమ్ యాదవ్ వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఆల్​రౌండర్ల విభాగంలో న్యూజిలాండ్ క్రికెటర్ సోఫీ డివైన్ అగ్రస్థానంలో నిలవగా.. భారత్ నుంచి దీప్తి శర్మ 5వ ర్యాంకుకు చేరుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.