వెస్టిండీస్‌తో జరిగిన మహిళా టీ20 ప్రపంచకప్ రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. రెండు పరుగుల తేడాతో గెలిచి మెగాటోర్నీ ముందు ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుంది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లు షఫాలీ వర్మ (12), స్మృతి మంధాన (4)తో పాటు స్టార్ బ్యాట్స్ఉమెన్ రోడ్రిగ్స్ (0), హర్మన్ ప్రీత్ (11), వేదా కృష్ణమూర్తి (5) విఫలమయ్యారు. శిఖా పాండే (24), దీప్తి శర్మ (21) ఫర్వాలేదనిపించారు. ఫలితంగా భారత మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ను 105 పరుగులకే కట్టడి చేశారు టీమిండియా బౌలర్లు. ఓపెనర్ లీ అన్ కిర్బీ 42 పరుగులతో మెరిసినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ 3 వికెట్లతో సత్తాచాటింది . దీప్తి శర్మ, శిఖా పాండే, హర్మన్ ప్రీత్ చెరో వికెట్ సాధించారు.
-
A thrilling victory for India in Brisbane – they win their first warm-up by two runs. #INDvWI | #T20WorldCup pic.twitter.com/juzmd3jRdC
— T20 World Cup (@T20WorldCup) February 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">A thrilling victory for India in Brisbane – they win their first warm-up by two runs. #INDvWI | #T20WorldCup pic.twitter.com/juzmd3jRdC
— T20 World Cup (@T20WorldCup) February 18, 2020A thrilling victory for India in Brisbane – they win their first warm-up by two runs. #INDvWI | #T20WorldCup pic.twitter.com/juzmd3jRdC
— T20 World Cup (@T20WorldCup) February 18, 2020