2022లో బర్మింగ్‌హామ్ వేదికగా జరిగే కామన్వెల్త్ క్రీడల్లో మహిళా క్రికెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వీటితో పాటే బీచ్ వాలీబాల్, పారా టేబుల్ టెన్నిస్‌ను ఈ జాబితాలో చేర్చాలని ప్రతిపాదించింది కామన్వెల్త్ క్రీడల సమాఖ్య(సీజీఎఫ్). భారత్ ఎక్కువగా పతకాలు సాధించే షూటింగ్‌ను ఈ ఈవెంట్ నుంచి తప్పించారు.
ఈ మార్పులు చేర్పులను వచ్చే నెలలో జరిగే సమావేశంలో సీజీఎఫ్ దేశాలు ధ్రువీకరించాల్సి ఉంటుంది. 2018లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో షూటింగ్లో భారత్ ఏడు స్వర్ణాలతో సహా 16 పతకాలు గెలుచుకుంది.
1998 కౌలాలంపూర్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో మాత్రమే పురుషుల క్రికెట్‌ను నిర్వహించారు. దక్షిణాఫ్రికా జట్టు విజేతగా నిలిచింది.
ఇది చదవండి: మైదానం నీ ఆటను మిస్సవుతోంది: మోదీ