-
Trust these two teams to give us a thriller!
— ICC (@ICC) June 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
A brilliant hundred from Kane Williamson and 🔥 from Colin de Grandhomme take New Zealand to a four-wicket win! #SAvNZ | #CWC19 pic.twitter.com/1nQk5Q2KTG
">Trust these two teams to give us a thriller!
— ICC (@ICC) June 19, 2019
A brilliant hundred from Kane Williamson and 🔥 from Colin de Grandhomme take New Zealand to a four-wicket win! #SAvNZ | #CWC19 pic.twitter.com/1nQk5Q2KTGTrust these two teams to give us a thriller!
— ICC (@ICC) June 19, 2019
A brilliant hundred from Kane Williamson and 🔥 from Colin de Grandhomme take New Zealand to a four-wicket win! #SAvNZ | #CWC19 pic.twitter.com/1nQk5Q2KTG
బర్మింగ్హమ్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది న్యూజిలాండ్. సెంచరీతో చెలరేగిన కెప్టెన్ విలియమ్సన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిన దక్షిణాఫ్రికా.. ప్రపంచకప్ రేసు నుంచి వైదొలిగింది.
242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 137 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ స్థితిలో ఓర్పుతో ఆడిన విలియమన్సన్- గ్రాండ్హమ్ ఆరో వికెట్‌కు 91 పరుగులు జోడించి కివీస్‌కు విజయాన్ని అందించారు . విలియమన్స్ 103 (నాటౌట్), గ్రాండ్హమ్ 60 (నాటౌట్) పరుగులు చేశారు.
సఫారీ బౌలర్లలో మోరిస్ 3 వికెట్లు తీశారు. ఎంగిడి, రబాడా, ఫెలుక్వాయో తలో వికెట్ దక్కించుకున్నారు.
అంతకు ముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఔట్‌ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టులో ఆమ్లా 55, వాన్డర్డసెన్ 67 పరుగులతో రాణించారు. మిల్లర్ 36, మార్క్రమ్ 38 పరుగులు చేశారు.
కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి సఫారీ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయకుండా నియంత్రించారు. ఫెర్గుసన్ 3, బౌల్ట్, గ్రాండ్హమ్, శాంటర్న్ తలో వికెట్ తీశారు.
ఇది చదవండి: కోహ్లీ రికార్డును కొద్దిలో మిస్సయిన ఆమ్లా