ETV Bharat / sports

ఐపీఎల్ విదేశాల్లోనా? పాలకమండలి ఆలోచన ఏంటి? - All discussed in Governing Council Meeting

టోర్నీ నిర్వహణపై ఐపీఎల్ పాలకమండలి సమావేశం నేడు జరిగింది. ఈ భేటీలో ఫ్రాంచైజీలూ పాల్గొన్నాయి. మొత్తం ఆరు నుంచి ఏడు అంశాలు చర్చకు వచ్చినట్లు అధికారులు చెప్పారు.

ఐపీఎల్
Governing Council Meeting
author img

By

Published : Mar 14, 2020, 3:15 PM IST

ఐపీఎల్ సీజన్ వాయిదా పడి, అభిమానుల్ని నిరాశపర్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో లీగ్ నిర్వహిస్తే, ఇబ్బందులు ఎదురువుతాయని బీసీసీఐ భావించింది. ఈ కారణంగానే ఈ నెల 29న ప్రారంభం కావాల్సిన టోర్నీని ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. ఈరోజు(శనివారం).. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, ఫ్రాంచైజీలతో భేటీ అయింది. ఇందులో ఆరు నుంచి ఏడు అంశాలు చర్చకు వచ్చాయని అధికారులు చెప్పారు.

"ఈ సమావేశంలో ఆరు నుంచి ఏడు అంశాలు చర్చకు వచ్చాయి. అందులో ఐపీఎల్​ను కుదించి నిర్వహించాలన్న ప్రతిపాదన ఉంది. విదేశాల్లో లీగ్ నిర్వహించాలన్న విషయం చర్చకు రాలేదు"

-బీసీసీఐ అధికారి

ఐపీఎల్ 13వ సీజన్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తొలుత ఖాళీ మైదానాల్లో లీగ్​ను నిర్వహించాలని అనుకున్నా, చివరకు వాయిదా వేసేందుకు నిర్ణయించారు. ఏప్రిల్ 15కి పరిస్థితి అదుపులోకి రాకపోతే లీగ్ నిర్వహణ ఏంటి? అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.