ETV Bharat / sports

'బంగ్లాదేశ్​తో మూడు టెస్టులు కాదు.. రెండే!' - బంగ్లాదేశ్​తో వెస్టిండీస్​ టెస్టు సిరీస్​

కరోనా పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్​తో ఆడాల్సిన మూడు టెస్టుల సిరీస్​ను రెండుకు తగ్గించే అవకాశముందని క్రికెట్​ వెస్టిండీస్​ వెల్లడించింది. ప్రస్తుతం కరోనా, షెడ్యూలింగ్​, ఖర్చు వంటి కోణాల్లో ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అయితే ఈ పర్యటనకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లనే పంపుతామని తెలిపింది.

WI vs BAN: West Indies Could Play Two Tests Instead Of Three Due To COVID-19 Pandemic
'బంగ్లాదేశ్​తో మూడు టెస్టులు కాదు.. రెండే!'
author img

By

Published : Nov 24, 2020, 7:01 AM IST

వచ్చే ఏడాది ఆరంభంలో బంగ్లాదేశ్‌ వేదికగా వెస్టిండీస్‌ మూడు టెస్టులు ఆడాల్సివుంది. కానీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ టెస్టు మ్యాచ్‌లను రెండుకు తగ్గించే అవకాశముందని క్రికెట్‌ వెస్టిండీస్‌ చెప్పింది. అందుబాటులో ఉన్న అత్యుత్తమ జట్టునే బంగ్లాకు పంపుతామని తెలిపింది.

"మూడు టెస్టులను రెండుకు తగ్గించే అవకాశముంది. కానీ ఇంకా ఖరారు కాలేదు. వచ్చే కొన్ని రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటాం. కరోనా, షెడ్యూలింగ్‌, ఖర్చు... ఇలా మేం అన్ని కోణాల నుంచి ఆలోచించాలి. కొవిడ్‌-19 ప్రపంచ క్రికెట్‌ ఆదాయంపై ప్రభావం చూపుతోంది. మేం బంగ్లాదేశ్‌కు వెళ్లాలనుకుంటున్నాం. ఆ దేశంతో సంబంధాన్ని, ద్వైపాక్షిక ఒప్పందాలను మేం గౌరవిస్తాం."

- రికీ స్కెరిట్​, క్రికెట్ వెస్టిండీస్​ అధ్యక్షుడు

బంగ్లా పర్యటనలో విండీస్‌ మూడేసి వన్డేలు, టీ20లు కూడా ఆడనుంది. వెస్టిండీస్‌ ప్రస్తుతం న్యూజిలాండ్‌ పర్యటనలో ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.