కేరళ యువ క్రికెటర్ సంజు శాంసన్... ఎన్నో సిరీస్‌ల్లో ఎంపికైనా, పుణె వేదికగా లంకతో జరిగిన మూడో టీ20లో బరిలోకి దిగే అవకాశమొచ్చింది. 73 మ్యాచ్‌ల తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చిన ఈ బ్యాట్స్‌మన్.. కోహ్లీ ఎప్పుడూ వచ్చే మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచినా.. అనూహ్యంగా రెండో బంతికి ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. వచ్చిన అవకాశం ఊహించని విధంగా ఇలా నీరుగారిపోవడం వల్ల కాస్త భావోద్వేగంతోనే మైదానాన్ని వీడాడు.
ట్రోఫీ బహుకరణ సమయంలో
ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు ధావన్, కేఎల్ రాహుల్ అర్ధశతకాలకు తోడు కోహ్లీ, మనీశ్ పాండే, శార్దూల్ ఠాకూర్ ప్రదర్శన కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది భారత్. లక్ష్య ఛేదనలో 123 పరుగులకే కుప్పకూలింది లంక. ఫలితంగా 78 పరుగులతో విజయం సాధించింది కోహ్లీసేన. మూడు టీ20 సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకుంది. మూడు ఫార్మాట్లలో కలిపి లంకతో 19 సిరీస్‌లు ఆడిన టీమిండియా.. 17 విజయాలు, 2 డ్రా నమోదు చేసింది.
ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌తో రాణించిన శార్దుల్.. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. సిరీస్‌లో ఐదు వికెట్లు ఖాతాలో వేసుకున్న సైనీ... మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. ట్రోఫీ బహుకరణ సమయంలో సంజూ మైదానంలో కనిపించలేదు. గ్రూప్ ఫొటోలోనూ అతడు మిస్సయ్యాడు. నెటిజన్లకు ఇది ఎన్నో సందేహాలు రేకెత్తించింది.
![why Sanju Samson was missing from the team picture at trophy celebrations in pune..?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/sanju-samson_1012newsroom_1575993550_0.jpg)
ఇదీ జరిగింది?
న్యూజిలాండ్ లో ప్రాక్టీస్ మ్యాచ్‌లకు ఇండియా-ఏ జట్టు శుక్రవారమే పయనమైంది. అయితే ఇందులో చోటు దక్కించుకున్న సంజూ... ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే వారిని కలిసేందుకు హోటల్‌కు వెళ్లిపోయాడు. మయాంక్ అగర్వాల్.. ఈరోజు షేర్ చేసిన ఓ ఫొటో ద్వారా ఈ విషయం తెలిసింది.
ఇండియా-ఏ.. కివీస్‌తో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈనెల 17 నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి.
-
Them boys ready for the tour! 😬 pic.twitter.com/865UXYJh7S
— Mayank Agarwal (@mayankcricket) January 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Them boys ready for the tour! 😬 pic.twitter.com/865UXYJh7S
— Mayank Agarwal (@mayankcricket) January 11, 2020Them boys ready for the tour! 😬 pic.twitter.com/865UXYJh7S
— Mayank Agarwal (@mayankcricket) January 11, 2020