ETV Bharat / sports

చరిత్ర సృష్టించిన రూట్- 100వ మ్యాచ్​లో 200 - బ్రాడ్​మన్

చెన్నై టెస్టులో డబుల్​ సెంచరీతో అదరగొట్టాడు ఇంగ్లాండ్ సారథి జో రూట్. ఇది అతడి కెరీర్​లో ఐదవ ద్విశతకం. ఈ నేపథ్యంలో టెస్టు క్రికెట్​లో ఎక్కువ సార్లు డబుల్​ సెంచరీ సాధించిన క్రికెటర్ల గురించి తెలుసుకుందామా.

'Who has scored most double centuries in Test cricket?
చరిత్ర సృష్టించిన రూట్- 100వ మ్యాచ్​లో 200
author img

By

Published : Feb 6, 2021, 4:18 PM IST

Updated : Feb 6, 2021, 5:02 PM IST

భారత్​తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్​ కెప్టెన్ జో రూట్ ద్విశతకంతో చెలరేగిపోయాడు. ఇది అతడికి 100వ టెస్టు. చరిత్రలో 100వ టెస్టులో ద్విశతకం బాదిన తొలి క్రికెటర్​ అతడే. టీమ్​ఇండియా బౌలర్లను ముప్పు తిప్పలు పెడుతూ 377 బంతుల్లో 218 పరుగులు చేశాడు రూట్. అశ్విన్​ బౌలింగ్​లో సిక్సర్​ బాది తన 5వ ద్విశతకాన్ని సాధించాడు.

సర్​ బ్రాడ్​మన్@1

అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన జాబితాలో ఆల్​టైమ్​ గ్రేట్, ఆస్ట్రేలియా దిగ్గజం సర్ డాన్ బ్రాడ్​మన్ ఉన్నారు. ఆయన ఆడిన 52 మ్యాచుల్లో 12 ద్విశతకాలు సాధించారు. కెరీర్​లో అసాధారణ సగటు 99.94తో 6,996 పరుగులు సాధించారు బ్రాడ్​మన్. అందులో 29 శతకాలు, 13 అర్ధ శతకాలున్నాయి.

ఆ తర్వాత 11 డబుల్​ సెంచరీలతో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా(9 ద్విశతకాలు) ఉన్నారు.

కోహ్లీ@4

7 డబుల్​ సెంచరీలతో భారత సారథి విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ క్రికెటర్ వాల్లీ హామండ్, శ్రీలంక బ్యాట్స్​మన్ మహేల జయవర్ధనే ఉన్నారు. ఆ తర్వాత 5 ద్విశతకాలు సాధించిన వారిలో అటపట్టు, వీరేంద్ర సెహ్వాగ్, జావేద్ మియాందాద్​, యూనిస్ ఖాన్, రికీ పాంటింగ్, సచిన్ తెందూల్కర్ ఉన్నారు.

ఇదీ చూడండి: ఆసీస్​ ఉత్తమ వన్డే ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్​గా స్మిత్​

Last Updated : Feb 6, 2021, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.