ETV Bharat / sports

'సచిన్​ను ఔట్​ చేసేందుకు ఎన్నో వ్యూహాలు రచించాం'

భారత క్రికెట్​ దిగ్గజం సచిన్​ తెందూల్కర్​ను ఔట్ చేసే వ్యూహంపై ఎన్నోసార్లు జట్టు సమావేశాలు నిర్వహించామని తెలిపాడు ఇంగ్లాండ్ మాజీ సారథి నాసర్ హుస్సేన్. తన కెరీర్​లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాట్స్​మెన్​లలో లిటిల్​ మాస్టర్​ ఒకడని అన్నాడు.

author img

By

Published : Jul 6, 2020, 1:27 PM IST

nazzar
నాజర్ హుస్సేన్

భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్​ను అప్పట్లో ఎలా ఔట్ చెయ్యాలో అర్థంకాక తమజట్టు సతమతమయ్యేదని తెలిపాడు ఇంగ్లాండ్ మాజీ సారథి నాసర్ హుస్సేన్. అతడి వికెట్​ తీసేందుకు లెక్కకు మించి జట్టు సమావేశాలు జరిపినట్లు వెల్లడించాడు. అతడి బ్యాటింగ్ టెక్నిక్‌ను ఛేదించాలంటే చాలా కష్టంగా ఉండేదని అన్నాడు. తాజాగా ఐసీసీ నిర్వహించిన 'క్రికెట్​ ఇన్​సైడ్​ అవుట్​' అనే కార్యక్రమంలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.

Nasser Hussain
నాజర్ హుస్సేన్

" సచిన్ తెందూల్కర్ ఆల్‌ టైమ్ ఫేవరెట్ బ్యాట్స్‌మెన్. అతడి బ్యాటింగ్ టెక్నిక్ అమోఘం. నేను ఇంగ్లాండ్ జట్టు సారథిగా ఉన్నప్పుడు.. అతడిని కట్టడి చేయాలనే వ్యూహంపై లెక్కకి మించి జట్టు సమావేశాల్ని నిర్వహించేవాడిని. నా కెరీర్​లో ఎదురైన అత్యంత కఠినమైన బ్యాట్స్​మెన్స్​లో​ సచిన్ ఒకడు. ​"

-నాసర్ హుస్సేన్, ఇంగ్లాండ్​ మాజీ సారథి.

Nasser Hussain
నాజర్ హుస్సేన్

దీంతో పాటు తన దృష్టిలో బ్యాటింగ్ టెక్నిక్ అంటే ఏ దేశంలోనైనా తడబడకుండా పరుగులు తీయడమే అని తెలిపాడు నాసర్​. ప్రస్తుతం న్యూజిలాండ్​ సారథి కేన్​ విలియమ్సన్​ మూడు ఫార్మాట్లలోనూ అద్భుతమైన బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​ టెక్నిక్ కనబరుస్తాడని అన్నాడు.

వెస్టిండీస్​ మాజీ క్రికెటర్​ ఇయాన్​ బిషప్​ కూడా సచిన్​పై ప్రశంసలు కురిపించాడు. అతడికి బౌలింగ్​ వేయడం కష్టతరమని అన్నాడు.

సచిన్​ తన సుదీర్ఘ కెరీర్‌లో టెస్టుల్లో 15,921 పరుగులతో పాటు 51 సెంచరీలు బాదాడు. వన్డేల్లో 18,426 పరుగులు చేశాడు. 2011లో టీమ్​ఇండియా ప్రపంచకప్ గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. ​

ఇది చూడండి : సచిన్​కు బౌలింగ్ చేయడం చాలా కష్టం: బిషప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.