వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓడింది. అయితే ఈ మ్యాచ్‌లో ఇరుజట్లలోని స్పిన్నర్లు చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. భారత గడ్డపై వికెట్ తీయకుండా ఎక్కువ బంతులేసిన మ్యాచ్‌గా ఇది మిగిలింది. మొత్తం 198 బంతులేశారు స్పిన్నర్లు.
ఇరు జట్లలో ఐదుగురు స్పిన్నర్లు.. 33 ఓవర్లు బౌలింగ్ చేసినా, కనీసం ఒక్క వికెటైనా తీయలేకపోయారు. 33 ఓవర్లు లేదా అంతకంటే ఎక్కువ బంతులేసి వికెట్ తీయకపోవడం.. అంతర్జాతీయ క్రికెట్లో ఇంతకుముందు 4 సార్లు మాత్రమే జరిగింది.
- 2001-02 సీజన్లో బంగ్లాదేశ్ - జింబాబ్వే మ్యాచ్‌లో స్పిన్నర్లు 228 బంతులు బౌలింగ్ చేశారు. ఢాకా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ పిచ్ స్పిన్‌కు అనుకూలించేదే.
- 2011లో జింబాబ్వే - పాకిస్థాన్ మ్యాచ్‌లో 222 బంతులేశారు స్పిన్నర్లు. హరారే వేదికగా ఈ మ్యాచ్ జరిగింది.
- 1996-97 సీజన్లో వెస్టిండీస్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో స్పిన్నర్లు 216 బంతులేశారు. బ్రిస్బేన్ గబ్బా వేదికగా ఈ మ్యాచ్ జరిగింది.
- 2011-12 సీజన్లో దక్షిణాఫ్రికా - శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో స్పిన్నర్లు 202 బంతులేశారు. తూర్పులండన్ వేదికగా ఈ పోరు జరిగింది.
ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. హెట్మయిర్ (139), హోప్ (102*) విండీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. విశాఖ వేదికగా రెండో వన్డే బుధవారం జరగనుంది.
ఇదీ చదవండి: కోహ్లీ.. క్రికెట్ ఆడుతున్న రొనాల్డో: లారా