ETV Bharat / sports

'తొలిచూపులోనే ఆమెను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యా' - ఇషాంత్​ శర్మ న్యూస్​

తన భార్య ప్రతిమను తొలిసారి బాస్కెట్​బాల్ కోర్టులో చూశానని, అప్పుడే తనను పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పాడు ఇషాంత్ శర్మ. వీటితో పాటే తన ప్రేమ గురించి చాలా విషయాలు పంచుకున్నాడు.

when I see prathima then I decided to marry her: Ishant Sharma
'తొలిచూపులోనే ఆమెను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యా'
author img

By

Published : Mar 16, 2020, 11:34 AM IST

టీమిండియాలో ప్రేమ పక్షులు అంటే టక్కున గుర్తొచ్చే పేరు విరాట్-అనుష్క. ఈ జాబితాలోకి ఇప్పుడు కొత్తగా హార్దిక్-నటాషా చేరారు. అయితే వీరిందరి కంటే ముందే ఓ బాస్కెట్​బాల్ క్రీడాకారిణిని తొలిచూపులోనే ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు ఇషాంత్ శర్మ. ఈ విషయాన్నే, ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

"2011లో నా స్నేహితుడు బాస్కెట్​బాల్ ఈవెంట్​ నిర్వహించాడు. నన్ను ముఖ్య అతిథిగా పిలిచాడు. అప్పుడే ప్రతిమను చూశా. ఆ క్షణమే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయా. అప్పటి నుంచి ఆమె ఆడే ప్రతిమ్యాచ్​కు తప్పకుండా వెళ్లేవాడిని. నాకు కొంచెం సిగ్గుగా అనిపించేది. కానీ, ఆ సమయంలో కనీసం తనతో మాట్లాడలేకపోయాను. దాదాపు ఏడాది ఇలానే గడిచిపోయింది. అప్పుడు ఆస్ట్రేలియా సిరీస్​కు వెళ్లే ముందు ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని తనతో అన్నా. ఆ తర్వాత లవ్ ప్రపోజ్ చేశా"

- ఇషాంత్​ శర్మ, టీమిండియా పేసర్​

when I see prathima then I decided to marry her: Ishant Sharma
ఇషాంత్​ శర్మ, ప్రతిమ సింగ్​

ఇషాంత్ తన ప్రేమను ప్రతిమకు వ్యక్తపరిచిన తర్వాత, దాదాపు ఐదేళ్ల పాటు వీరిద్దరూ డేటింగ్ చేశారు. అనంతరం పెద్దల అంగీకారంతో 2016 డిసెంబరు 9న పెళ్లి చేసుకున్నారు.

గత కొన్నేళ్ల నుంచి టీమిండియా తరఫున టెస్టులో నిలకడగా రాణిస్తున్నాడు ఇషాంత్. ఇటీవలే న్యూజిలాండ్​ పర్యటనలోనూ ఓ మ్యాచ్​లో ఐదు వికెట్లతో సత్తా చాటాడు. గత నవంబర్​లో భారత్​ ఆడిన తొలి గులాబీ బంతి టెస్టులోనూ ఐదు వికెట్లు తీసి, ఈ ఘనత సాధించిన తొలి బౌలర్​గా నిలిచాడు.

ఇదీ చూడండి.. 'ఐపీఎల్​కు ఇస్తున్న ప్రాధాన్యం రంజీలకు ఇవ్వడం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.