టీమ్ఇండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు బ్యాటింగ్‌లో ఎవరికి వారే సాటి. వీరిద్దరూ బరిలో దిగితే ప్రత్యర్థి జట్టులో కలవరం మొదలవడం ఖాయం. అలాంటి పరిస్థితే ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్‌కు ఎదురైంది. జనవరిలో బెంగళూరు వేదికగా జరిగిన వన్డేలో కోహ్లీ, రోహిత్ విజయవంతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో వీరిని ఔట్ చేసేందుకు సలహ ఇవ్వమని, ఆ మ్యాచ్‌లో అంపైరింగ్ చేస్తున్న మైకేల్ గాఫ్‌ను కోరాడు. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు గాఫ్.
"భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ, రోహిత్ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పడం ఇంకా గుర్తుంది. స్క్వేర్ లెగ్‌లో నిల్చొని అంపైరింగ్ చేస్తున్నాను. నా పక్కనే ఉన్న ఫించ్.. వారిద్దరిని ఔట్ చేయడం ఎలా? అని నన్ను అడిగాడు. 'నాకు చేతి నిండా పనుంది. నీ పని నీకుంది' అని నేను జవాబిచ్చాను"
- మైకేల్ గాఫ్, అంపైర్
జనవరిలో బెంగళూరు వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ గురించే అంపైర్ మైకేల్ గాఫ్ ప్రస్తావించారు. ఆ రోజు కోహ్లీ (89), రోహిత్ (119) విజయవంతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో వికెట్‌కు 137 పరుగుల జోడించారు. ఆసీస్ నిర్దేశించిన 286 పరుగల లక్ష్యాన్ని టీమ్ఇండియా 47.3 ఓవర్లలో చేధించింది. ఏడు వికెట్ల తేడాతో చివరి మ్యాచ్‌లో విజయం సాధించడమే కాకుండా మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో భారత్ గెలుపొందింది.
ఇదీ చూడండి... పక్షి ప్రాణాలు కాపాడటంలో ధోనీకి సాయపడ్డ జీవా