ETV Bharat / sports

ఆసీస్​తో సిరీస్​లో టీమ్ఇండియా ముందున్న సవాళ్లివే! - విరాట్​ కోహ్లీ

గతేడాది ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ విజేతగా నిలిచి టీమ్​ఇండియా చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది అంతే అంచనాలతో ఆసీస్​లో అడుగుపెట్టిన కోహ్లీసేనకు తొలిటెస్టులోనే పరాభవం ఎదురైంది. కానీ, ఈ సిరీస్​లో గెలుపొందాలంటే రానున్న రెండు టెస్టులే భారత జట్టుకు కీలకం కానున్నాయి. అయితే ఇవే రెండు మ్యాచ్​లలో టీమ్ఇండియా అనేక సవాళ్లను ఎదుర్కోనుంది.

what were the challenges are facing Team India in AUS test series
ఆసీస్​తో సిరీస్​లో టీమ్ఇండియా ఎదుర్కొవాల్సిన సవాళ్లివే!
author img

By

Published : Dec 21, 2020, 9:57 AM IST

కరోనా విరామం తర్వాత తొలి టెస్టు సిరీస్‌. అది కూడా ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియాతో! గత సిరీస్‌ (2018-19)లో కంగారూ గడ్డపై సుదీర్ఘ ఫార్మాట్‌లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన నేపథ్యంలో ఈ సారి భారీ అంచనాలతో అడుగుపెట్టింది టీమ్‌ఇండియా. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంతో విజయం సాధించేందుకు సువర్ణావకాశం. కానీ దారుణమైన బ్యాటింగ్‌తో తన టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసి ఘోర పరాజయం. ఇదీ క్లుప్తంగా భారత జట్టు ప్రస్తుత పరిస్థితి. సిరీస్‌లో మరో మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో జట్టు ఇప్పుడేం చేయాలి? జట్టు ముందున్న సవాళ్లు ఏమిటి?

సిరీస్‌ ఏదైనా సరే మంచి ఆరంభం దక్కితే జట్టు ఆత్మవిశ్వాసం పెరుగుతుందనడంలో సందేహం లేదు. పైగా ఆస్ట్రేలియాతో దాని సొంతగడ్డపై సిరీస్‌ అంటే కచ్చితంగా విజయారంభం చేయాలి. అలా చేస్తేనే జట్టు మానసికంగా బలంగా మారడం సహా ప్రత్యర్థిని వెనక్కినెట్టినట్లు అవుతుంది. కానీ టీమ్‌ఇండియా ప్రతిష్ఠాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీని పరాజయంతో మొదలెట్టింది. అది కూడా అలాంటి ఇలాంటి ఓటమి కాదు. భారత క్రికెట్‌ చరిత్రలో ఓ పీడకలలా మిగిలిపోయే పేలవ ప్రదర్శనతో అభిమానులకు తీవ్రమైన బాధను మిగిల్చింది. కంగారూ జట్టుతో సిరీస్‌ అంటే తొలి మ్యాచ్‌లో మామూలుగా ఓడితేనే పుంజుకోవడం కష్టం.. అలాంటిది ఈ స్థాయిలో ఓటమితో పాటు అప్రతిష్ఠ మూటగట్టుకున్న భారత్‌ తిరిగి పుంజుకోవాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే!

మళ్లీ అదే సమస్య..

టీమ్‌ఇండియాకు మళ్లీ ఓపెనింగ్‌ సమస్య మొదలైంది. తొలి టెస్టులో మయాంక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన పృథ్వీ షా.. రెండు ఇన్నింగ్స్‌ (0, 4)ల్లో పూర్తిగా విఫలమయ్యాడు. పరుగులు చేయడం సంగతి పక్కనపెడితే కనీసం క్రీజులో కాస్త సమయం కూడా గడపలేదు. మొత్తంగా మ్యాచ్‌లో కేవలం ఆరు బంతులే మాత్రమే ఎదుర్కొని రెండు సార్లు బౌల్డై తన బలహీనతను బయటపెట్టుకున్నాడు. సన్నాహక మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన చేసిన శుభ్‌మన్‌ గిల్‌ను కాదని షాను తొలి టెస్టులో ఆడించిన జట్టు మేనెజ్‌మెంట్‌.. రెండో టెస్టు కోసం కచ్చితంగా షాను పక్కనబెట్టనుంది. అతని స్థానంలో గిల్‌ టెస్టు అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమే. మూడో టెస్టు నుంచి రెగ్యులర్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అందుబాటులో ఉండనున్నాడు కాబట్టి.. శనివారం ఆరంభమయ్యే బాక్సింగ్‌ డే మ్యాచ్‌లో మయాంక్‌తో కలిసి గిల్‌ జట్టుకు శుభారంభాన్ని అందించాల్సి ఉంది.

కోహ్లీ లేని జట్టు..

గత కొన్నేళ్లుగా స్వదేశంలో, విదేశాల్లో జట్టును బాగానే నడిపిస్తున్న కెప్టెన్‌ కోహ్లీ.. సిరీస్‌లో మిగతా మూడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు. అతని స్థానంలో రహానె కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ లేని లోటు.. సిరీస్‌ తొలి మ్యాచ్‌లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న జట్టుపై గట్టి ప్రభావమే చూపనుంది. కోహ్లీ స్థానంలో కేఎల్‌ రాహుల్‌ జట్టులోకి వచ్చినప్పటికీ ఆ బ్యాటింగ్‌ స్థాయిని అందుకుంటాడా? అన్నది సందేహమే. కేవలం బ్యాట్స్‌మన్‌గానే అని కాదు కోహ్లీ జట్టులో ఉంటే ఆ వాతావరణమే వేరుగా ఉంటుంది. తన దూకుడు, ఉనికి ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు. తొలి ఇన్నింగ్స్‌లో భారత ఫీల్డర్లు క్యాచ్‌లు జారవిడుస్తుంటే.. కోహ్లీ అద్భుతమైన క్యాచ్‌తో గ్రీన్‌ను వెనక్కి పంపి సహచరుల్లో స్ఫూర్తి నింపాడు. ఇప్పుడు అతడు లేకున్నా జట్టు అవే ప్రమాణాలను కొనసాగించాలి.

ఆ ఇద్దరు నిలిస్తేనే..

కోహ్లీ గైర్హాజరీలో మిగిలిన మ్యాచ్‌ల్లో జట్టు భారాన్ని మోసే బాధ్యత అనుభవజ్ఞులైన పుజారా, రహానేలదే. ఇప్పటివరకూ 66 టెస్టులాడిన రహానె.. 78 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించిన పుజారా ఆ అనుభవంతో జట్టుకు అండగా నిలవాలి. ముందుగా వీళ్లు తొలి టెస్టు ఓటమిని పక్కనపెట్టి మనసు తేలిక చేసుకోవాలి. బ్యాట్‌తో రాణించి యువ ఆటగాళ్లకు మార్గం చూపించాల్సిన గురుతర బాధ్యత వీళ్లపై ఉంది. మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పుజారా (43), రహానె (42) ఫర్వాలేదనిపించారు. కానీ వీళ్లు ఈ మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచాల్సిన అవసరం ఉంది. క్రీజులో ఎక్కువ సమయం గడిపి యువ ఆటగాళ్లతో భాగస్వామ్యాలు నమోదు చేస్తూ వాళ్లపై ఉన్న ఒత్తిడిని తొలగించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా గత పర్యటనలో 4 మ్యాచ్‌ల్లో 74.42 సగటుతో 521 పరుగులు చేసి ఆ సిరీస్‌లో అత్యధిక పరుగులు (రెండు జట్లలోనూ) చేసిన ఆటగాడిగా నిలిచిన పుజారా మరోసారి ఆ ప్రదర్శన పునరావృతం చేయాలి. మరోవైపు కెప్టెన్‌గా వ్యవహరించనున్న రహానె.. బ్యాటింగ్‌తో పాటు జట్టు ప్రదర్శనపై కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

బౌలింగ్‌లో ఎలా?

గత పర్యటనలో ఆస్ట్రేలియాలో భారత జట్టు చారిత్రక టెస్టు సిరీస్‌ విజయాన్ని అందుకోవడంలో పేసర్లు బుమ్రా, షమీ కీలక పాత్ర పోషించారు. 4 మ్యాచ్‌ల్లో బుమ్రా 21 వికెట్లు తీయగా.. షమీ 16 వికెట్లు పడగొట్టాడు. ఒకరు కాకపోతే మరొకరు రాణించి ప్రత్యర్థి భరతం పట్టారు. కానీ ప్రస్తుత సిరీస్‌లో గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు షమీ దూరం కావడం భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ. ఇప్పుడు పూర్తి భారం బుమ్రా, ఉమేశ్‌లపైనే పడనుంది. ముఖ్యంగా బౌలింగ్‌ దాడిని బుమ్రా ఒంటరిగా నడిపించాల్సిందే. షమీకి ప్రత్యామ్నాయంగా జట్టులోకి తీసుకునేందుకు సిరాజ్‌, సైనీ మాత్రమే టెస్టు బృందంలో ఉన్నారు. మంచి వేగం, బౌన్స్‌ రాబట్టే సామర్థ్యం ఉన్న సిరాజ్‌ టెస్టు అరంగేట్రం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇద్దరిలో ఎవరు తుది జట్టులోకి వచ్చినా వాళ్లకిదే తొలి టెస్టు కానుంది. ఈ నేపథ్యంలో ఈ యువ పేసర్లు.. సీనియర్‌ బౌలర్‌ షమి స్థానాన్ని భర్తీ చేయగలరా అన్నది చూడాలి. వీళ్లతో భారత్‌ ఎంతమేరకు ప్రత్యర్థిని కట్టడి చేస్తుందన్న దానిపైనే జట్టు విజయం ఆధారపడి ఉంది.

ఇదీ చూడండి: కోహ్లీతో పాటే స్వదేశానికి షమీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.