ఐసీసీ నిబంధన ప్రకారం.. మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎవరైనా ఆటగాడికి తలపై లేదా మెడపై గాయమై.. తల తిరిగినట్లు, మైకం కమ్మినట్లు అనిపిస్తే ఆ ఆటగాడు కంకషన్‌కు గురయ్యాడని భావిస్తారు. ఆ జట్టు వైద్యుడు ఆ ఆటగాడిని పరీక్షించి అతని పరిస్థితిని అంచనా వేస్తాడు.
ఒకవేళ ఆ ఆటగాడు నిజంగానే కంకషన్‌కు గురైతే అతని స్థానంలో మరో ఆటగాడ్ని మైదానంలోకి పంపేందుకు మ్యాచ్ రిఫరీకి విన్నవించాల్సి ఉంటుంది. ఆ ఆటగాడు మ్యాచ్‌లో ఏ విధంగా కంకషన్‌కు గురి కావాల్సి వచ్చింది? ఏ సమయంలో అలా జరిగింది? అతనికి బదులుగా సరైన ప్రత్నామ్నాయ ఆటగాడి(బౌలర్ స్థానంలో బౌలర్, బ్యాట్స్‌మన్ స్థానంలో బ్యాట్స్‌మన్)గా ఎవరిని జట్టు ఆడించాలనుకుంటుంది? అనే వివరాలను రిఫరీ ముందుంచాలి.
వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత.. ఆ వివరాలన్నీ సరైనవే అని రిఫరీ భావిస్తే అప్పుడతడు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌కు అనుమతిస్తాడు. ఈ మ్యాచ్‌లో అప్పటికే జడేజా బ్యాటింగ్ పూర్తయింది. కాబట్టి ఆసీస్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ వేసే వీలుండేది. అందుకే స్పిన్ వేసే చాహల్‌ను కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా తీసుకున్నారు. నిరుడు యాషెస్ సిరీస్‌లో భాగంగా ఓ మ్యాచ్‌లో స్మిత్ ఇలాగే కంకషన్‌కు గురైతే అతని స్థానంలో లబుషేన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి బ్యాటింగ్ చేశాడు.
ఇదీ చూడండి: కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా చాహల్.. ఆసీస్ కోచ్ అసంతృప్తి