భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతోన్న తొలి టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. మొదటి ఇన్నింగ్స్‌లో 297 పరుగులు చేసిన టీమిండియా విండీస్‌ను 222 పరుగులకు కట్టడి చేసింది. ఈ మ్యాచ్‌లో కరీబియన్ ఆటగాడు మిగెల్ కమిన్స్ అనుకోని రికార్డును మూటగట్టుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కమిన్స్.. సారథి హోల్డర్‌తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ఈ క్రమంలో 45 బంతులాడిన ఈ ఆటగాడు ఒక్క పరుగు చేయకుండా చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. ఫలితంగా క్రీజులో ఎక్కువ సేపు గడిపి పరుగులేమీ చేయకుండా వెనుదిరిగిన రెండో బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కాడు.
కమిన్స్ 95 నిమిషాల పాటు బ్యాటింగ్ చేశాడు. న్యూజిలాండ్ క్రికెటర్ జియోఫ్ అల్లాట్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ ఆటగాడు 1999లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 101 నిమిషాలు క్రీజులో ఉండి డకౌట్‌గా వెనుదిరిగాడు.
ఇవీ చూడండి.. యాషెస్: ఏడు వికెట్లా.. 203 పరుగులా !