ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న టోర్నీ 'ద హండ్రెడ్'. ఈ వంద బంతుల క్రికెట్ వేలం జాబితాలో కొందరు ఆటగాళ్లు భారీ ధరలకు నామినేషన్ వేశారు. వెస్టిండీస్ విధ్వంసకారుడు క్రిస్ గేల్, ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు.
అత్యధిక ప్రారంభ ధర 1,25,000 యూరోలు (రూ. 98 లక్షలకు పైగా) కింద కోట్ చేసిన ఆరుగురు ఆటగాళ్లలో గేల్, స్మిత్ ఉన్నారు. వీరితో పాటు మిషెల్ స్టార్క్, లసిత్ మలింగ, కగిసో రబాడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌లో గేల్‌కు దక్కని చోటు..
వంద బంతుల టోర్నీలో ఖరీదైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న క్రిస్‌గేల్‌కు చుక్కెదురైంది. అఫ్గానిస్థాన్‌తో జరగనున్న ఓ టెస్టు, 3 టీ20లు, 3 వన్డేల సిరీస్‌కు గేల్‌ను ఎంపిక చేయలేదు విండీస్ సెలక్టర్లు. అతడితోపాటు ఆండ్రూ రసెల్నూ పక్కన పెట్టారు.
ఇటీవల జరిగిన కరీబియన్ ప్రిమియర్ లీగ్‌లో ప్రదర్శన ఆధారంగా సెలక్టర్లు జట్టును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు కీరన్ పొలార్డ్ విండీస్ సారథిగా వ్యవహరిస్తుండగా.. టెస్టు కెప్టెన్‌గా జేసన్ హోల్డర్‌కు పగాలు అప్పగించారు. చాలా రోజులుగా సరైన ప్రదర్శన చేయని హోల్డర్‌ను... వన్డే, టీ20 సిరీస్‌ల్లోనూ ఎంపిక చేయడం విశేషం.
నవంబరు 5 నుంచి డిసెంబరు 1 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత్‌లోని దెహ్రాదూన్ వేదికగా అప్గాన్ - విండీస్ జట్లు తలపడనున్నాయి.
ఇదీ చదవండి: ఐసీసీ 'సూపర్' నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: సచిన్