యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్.. తాజాగా న్యూజిలాండ్-భారత్ మధ్య టెస్టు మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షిస్తూ సందడి చేశాడు. అభిమానులతో కలిసి వీక్షకుల గ్యాలరీలో కూర్చొని అలరించాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
333 రింగ్ చూశారా?
క్రిస్‌గేల్.. ప్రపంచ క్రికెట్లో తనదైన ఆటతో అభిమానులను సృష్టించుకున్నాడు. ఫ్యాషన్ దుస్తులతోనూ మెరుస్తుంటాడు. తాజాగా శనివారం తన పేరు, బొమ్మ ఉన్న బంగారపు ఉంగరాన్ని ఆవిష్కరించాడు. లిమిటెడ్ ఎడిషన్ పేరిట అభిమానుల కోసం దీన్ని విడుదల చేశాడు. ఈ ఉంగరంపై అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 333, పేరు క్రిస్‌గేల్(సీజీ), యూనివర్సల్ బాస్ టైటిల్‌తో పాటు వెనక భాగంలో సంతకం కూడా ముద్రించి ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
2019 మార్చిలో చివరి టీ20 ఆడిన గేల్.. ప్రస్తుతం పలు దేశాల్లో టీ20 లీగ్‌ల్లో ఆడుతున్నాడు. ఇటీవల కరీబియన్ లీగ్‌లో ఆడిన ఇతడు.. త్వరలో నేపాల్‌లో జరగనున్న ఎవరెస్ట్ ప్రీమియర్ లీగ్(ఈపీఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లోనూ కనువిందు చేయనున్నాడు.
ఈపీఎల్ ఫిబ్రవరి 29న కాఠ్మాండు వేదికగా ప్రారంభం కానుంది. ఇందులో ఫోక్రా రైనోస్ జట్టు తరఫున ఆడనున్నాడు గేల్. అంతేకాకుండా మార్చి 29 నుంచి మొదలు కానున్న ఐపీఎల్‌లోనూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరఫున బరిలో దిగనున్నాడు.