ETV Bharat / sports

ప్రపంచకప్​నకు మేము సిద్ధమే: ఆసీస్ కెప్టెన్ - క్రికెట్ ఆస్ట్రేలియా వార్తలు

వన్డే ప్రపంచకప్​నకు తాము సిద్ధంగానే ఉంటామని చెప్పింది ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్. టోర్నీ నిర్వహణ.. ఐసీసీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది. కరోనా పరిస్థితులు త్వరగా చక్కదిద్దుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పింది.

ప్రపంచకప్​నకు మేము సిద్ధమే: ఆసీస్ కెప్టెన్
కెప్టెన్ మెగ్ లానింగ్
author img

By

Published : Jul 23, 2020, 12:26 PM IST

రాబోయే మహిళల వన్డే ప్రపంచకప్​ గురించి మాట్లాడిన ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్.. ఆ సమయానికి తాము సిద్ధంగానే ఉంటామని చెప్పింది. న్యూజిలాండ్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది.​ ఓ క్రీడాకారిణిగా, ప్రస్తుత పరిస్థితులు త్వరగా చక్కదిద్దుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. అయితే నిర్వహకులు తీసుకునే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది.

Aussie skipper Meg Lanning
ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్

"టోర్నీ నిర్వహణపై ఐసీసీ ఆలోచిస్తోంది. ఎందుకంటే ప్రపంచకప్​నకు సిద్ధమయ్యేందుకు అన్ని జట్లకు తగినంత సమయం ఉందా? ఇంకా కొన్ని క్వాలిఫైయింగ్ మ్యాచ్​లు జరగాలి. ఈ పరిస్థితి ఎలా చక్కదిద్దుకుంటుందో చూడాలి. దీనితో పాటే ప్రపంచకప్​ జరుగుతుందా లేదా అని సందేహాలు వస్తున్నాయి. ఓ క్రీడాకారిణిగా నేనైతే టోర్నీ అనుకున్న ప్రకారం జరగాలనే అనుకుంటాను. కానీ నిర్వహకులు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే"

-మెగ్ లానింగ్, ఆస్ట్రేలియా కెప్టెన్

ఇటీవలే మాట్లాడిన ఐసీసీ చీఫ్ మను సావ్నే.. ఆడే ప్రతి ఒక్కరి ఆరోగ్యం, భద్రతే తమకు తొలి ప్రాధాన్యమని అన్నారు. షెడ్యూల్​ ప్రకారం మేలో అర్హత టోర్నీ జరగాలి. కరోనా వల్ల అదికాస్త జులైకు వాయిదా పడింది. ఇందులో భాగంగా ప్రపంచకప్​లోని మిగిలిన మూడుస్థానాల కోసం బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఐర్లాండ్, వెస్టిండీస్, థాయ్​లాండ్, జింబాబ్వే, పపువా న్యూగినియా, యూఎస్​ఏ, నెదర్లాండ్స్ పోటీపడనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.