ETV Bharat / sports

సీఎస్కే అన్ని విభాగాల్లో పటిష్ఠం: మైక్ హస్సీ - ఐపీఎల్ 2021

ప్రస్తుత ఐపీఎల్ సీజన్​కు అద్భుతంగా సన్నద్ధమవుతున్నామని తెలిపాడు చెన్నై బ్యాటింగ్ కోచ్​ మైక్ హస్సీ. అన్ని విభాగాల్లో జట్టు సమతూకంగా మారిందని.. ఇంతకు ముందుతో పోలిస్తే బలంగా ఉందని పేర్కొన్నాడు.

We have a very balanced squad that has most bases covered: CSK batting coach Hussey
'సీఎస్కే అన్ని విభాగాలలో పటిష్ఠంగా ఉంది'
author img

By

Published : Apr 4, 2021, 9:11 AM IST

గతేడాది ఐపీఎల్‌ వైఫల్యాలను మర్చిపోయి తాజాగా ఆరంభించేందుకు ఎదురు చూస్తున్నామని చెన్నై సూపర్‌కింగ్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌ మైకేల్‌ హస్సీ అన్నాడు. అన్ని విభాగాల్లో జట్టు బలంగా మారిందని పేర్కొన్నాడు. ఇంతకు ముందుతో పోలిస్తే మరింత సమతూకం పెరిగిందని తెలిపాడు. కుర్రాళ్లు స్ఫూర్తితో ఉన్నారని, అద్భుతంగా సన్నద్ధమవుతున్నారని వివరించాడు.

యూఏఈలో జరిగిన ఐపీఎల్‌-2020లో చెన్నై పేలవంగా ఆడింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. తొలిసారి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ప్రస్తుత సీజన్‌కు ముందు కొందరు ఆటగాళ్లను వదిలేసిన సీఎస్‌కే.. భారీ ధర పెట్టి కృష్ణప్ప గౌతమ్‌, మొయిన్‌ అలీని కొనుగోలు చేసింది. రాజస్థాన్‌ నుంచి రాబిన్‌ ఉతప్పను బదిలీ చేసుకుంది. ఈ ముగ్గురూ చేరడం జట్టుకు అదనపు బలం చేకూరిందని హస్సీ అన్నాడు.

ఇదీ చదవండి: సెహ్వాగ్ వరుస ఫోర్లు.. గంగూలీకి అర్థమైన ఆ విషయం

"వాళ్లు ముగ్గురూ చేరడం వల్ల జట్టు సమతూకం మరింత పెరిగింది. మొయిన్‌ చక్కని ఆల్‌రౌండర్‌. రాబిన్‌కు ఎంతో అనుభవం ఉంది. గతంలో అద్భుతంగా ఆడాడు. గౌతమ్‌లో చక్కని ప్రతిభ దాగుంది. దానిని మరింత సానబెట్టాలని అనుకుంటున్నాం."

-మైక్ హస్సీ, సీఎస్కే బ్యాటింగ్ కోచ్.

జట్టుకు శుభారంభం లభిస్తే ఆటగాళ్లు సేదతీరి మరింత బాగా ఆడతారని హస్సీ పేర్కొన్నాడు. "శుభారంభం ఎప్పటికీ బాగుంటుంది. ఆటగాళ్లు సైతం సేదతీరుతారు. అత్యుత్తమ క్రికెట్‌ ఆడేందుకు వారిలో ఆత్మవిశ్వాసం వస్తుంది. ముంబయిలో కొన్ని మ్యాచులు ఆడటం ఆటగాళ్లు నిలదొక్కుకొనేందుకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. వాంఖడేలో పరిస్థితులు బాగుంటాయి. బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లకూ అనుకూలంగా ఉంటుంది" అని హస్సీ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: గాయంతో రింకూ దూరం.. కేకేఆర్​లోకి గుర్‌కీరత్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.